Wednesday, 11 February 2026

మేము ఎవరినీ దుర్భాషలాడలేదు


  • ఎంపీలను ప్రేరేపించాననే ఆరోపణలను ఖండించిన ప్రియాంకా గాంధీ

న్యూఢిల్లీ: పార్లమెంటులో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు చేసిన ఆరోపణలను కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ ప్రియాంకా గాంధీ వాద్రా తీవ్రంగా ఖండించారు. తనపై వచ్చిన ఆరోపణలు నిరాధారమని ఆమె స్పష్టం చేశారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఛాంబర్‌లో సుమారు 20-25 మంది కాంగ్రెస్ ఎంపీలు ప్రవేశించి, స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఆ సమయంలో ప్రియాంకా గాంధీ, కేసీ వేణుగోపాల్ వంటి సీనియర్ నాయకులు అక్కడే ఉండి వారిని ప్రేరేపించారని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు సంచలన ఆరోపణలు చేశారు.



ప్రియాంకా గాంధీ వివరణ

ఈ ఆరోపణలపై ప్రియాంకా గాంధీ స్పందిస్తూ.. "మేము ఎవరినీ దుర్భాషలాడలేదు. ఒకటి రెండు అంశాలపై ఎంపీలు ఆందోళన చెంది, వాటిని వ్యక్తపరిచారు. నేను వారిని ప్రేరేపించానని రిజిజు అనడం అబద్ధం. నేను చాలా నిశ్శబ్దంగా కూర్చున్నాను. చివర్లో ప్రశాంతంగా కొన్ని విషయాలు మాట్లాడాను" అని మీడియాకు తెలిపారు.  ఇదే సమయంలో ప్రియాంకా గాంధీ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం వల్ల రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆమె ఆరోపించారు. రైతుల ప్రయోజనాలను కాపాడటంలో ప్రభుత్వం విఫలమైందని, నేడు సమ్మెలో ఉన్న కార్మిక సంఘాలకు తాము మద్దతు ఇస్తున్నామని ఆమె పేర్కొన్నారు. అలాగే, రాహుల్ గాంధీపై ఎన్ని కేసులు పెట్టినా, ఎలాంటి చర్యలు తీసుకున్నా ఆయన వెనకడుగు వేసే ప్రసక్తే లేదని ప్రియాంకా గాంధీ స్పష్టం చేశారు.

No comments:

Post a Comment

Featured post

అస్సాం అసెంబ్లీ పోరు: కాంగ్రెస్‌కు అగ్నిపరీక్ష

ప్రియాంక గాంధీ ముందున్న సవాళ్లు ఇవే డిస్పూర్: అస్సాం అసెంబ్లీ ఎన్నికల నగారా మోగుతున్న తరుణంలో, రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా వేడెక్కిం...