Saturday, 7 February 2026

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల అంతుచూడండి


  • రాయ్‌పూర్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా హై లెవెల్ సెక్యూరిటీ సమీక్ష

రాయపూర్: ఛత్తీస్‌గఢ్‌లో వామపక్ష తీవ్రవాద  ప్రభావిత ప్రాంతాలలో భద్రతా ఏర్పాట్లు, అభివృద్ధి ప్రాజెక్టులను సమీక్షించడానికి కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి అమిత్ షా శనివారం రాయ్‌పూర్‌లో రెండు ఉన్నతస్థాయి సమావేశాలను నిర్వహించారు. ఈ సమావేశాలలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సీనియర్ అధికారులు, భద్రతా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.



  • భద్రతా సమీక్ష

తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలలో భద్రతా పరిస్థితిని అమిత్ షా నిశితంగా పరిశీలించారు. తీవ్రవాద నిర్మూలనతో పాటు, ఆయా ప్రాంతాల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు చర్చించారు. ఈ సాయంత్రం, కేంద్ర హోంమంత్రి రాయపూర్‌లో జరిగే "Chhattisgarh @25: Shifting the Lens" అనే జాతీయ సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. సోమవారం జగదల్‌పూర్‌లో జరగనున్న "బస్తర్ పండుం ఫెస్టివల్" ముగింపు వేడుకలకు అమిత్ షా హాజరుకానున్నారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం అమిత్ షా శనివారం సాయంత్రం రాయ్‌పూర్‌కు చేరుకున్నారు.

No comments:

Post a Comment

Featured post

దూరదర్శన్‌ మాజీ వార్తా వ్యాఖ్యాత సరళా మహేశ్వరి కన్నుమూత

  న్యూఢిల్లీ: దూరదర్శన్‌ మాజీ వార్తా వ్యాఖ్యాత సరళా మహేశ్వరి (71) కన్నుమూశారు. 1980, 1990 దశకాల్లో దూరదర్శన్‌ వార్తా ప్రసారాల్లో పరిచయమైన ...