Saturday, 7 February 2026

భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం


  • రెండు దేశాల మధ్య పెరుగుతున్న విశ్వాసానికి నిదర్శనం 
  • ప్రధాని నరేంద్ర మోడీ

న్యూఢిల్లీ: భారత్ - అమెరికా మధ్య కుదిరిన తాత్కాలిక వాణిజ్య ఒప్పంద ముసాయిదా  రెండు దేశాల మధ్య పెరుగుతున్న లోతైన సంబంధాలు, విశ్వాసం , డైనమిజానికి అద్దం పడుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. ఇది గొప్ప వార్త అని అభివర్ణించిన ఆయన, రెండు దేశాల మధ్య బలమైన సంబంధాల కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చూపిస్తున్న వ్యక్తిగత నిబద్ధతకు కృతజ్ఞతలు తెలిపారు.



ఒప్పందం వల్ల కలిగే ప్రయోజనాలు

ఈ ఒప్పందం దేశంలోని కష్టపడే రైతులు, పారిశ్రామికవేత్తలు, ఎంఎస్‌ఎంఈలు, స్టార్టప్ ఆవిష్కర్తలు , మత్స్యకారులకు కొత్త అవకాశాలను తెరవడం ద్వారా 'మేక్ ఇన్ ఇండియా'ను మరింత బలోపేతం చేస్తుంది. మహిళలు ,యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలను కల్పిస్తుంది.  ఆవిష్కరణలను ప్రోత్సహించడంలో భారత్-అమెరికా నిబద్ధతను ఇది బలోపేతం చేస్తుంది, పెట్టుబడి, సాంకేతిక భాగస్వామ్యాలను మరింత లోతుగా చేస్తుంది. ప్రధాని మోడీ మాట్లాడుతూ.. ఈ ఒప్పందం స్థిరమైన, విశ్వసనీయమైన సప్లై చైన్స్‌ ను బలోపేతం చేయడమే కాకుండా ప్రపంచ వృద్ధికి కూడా తోడ్పడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

No comments:

Post a Comment

Featured post

అస్సాం అసెంబ్లీ పోరు: కాంగ్రెస్‌కు అగ్నిపరీక్ష

ప్రియాంక గాంధీ ముందున్న సవాళ్లు ఇవే డిస్పూర్: అస్సాం అసెంబ్లీ ఎన్నికల నగారా మోగుతున్న తరుణంలో, రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా వేడెక్కిం...