న్యూఢిల్లీ: ప్రధానమంత్రి కార్యాలయం (PMO), జాతీయ భద్రతా మండలి సచివాలయం (NSCS), క్యాబినెట్ సచివాలయాలను ఒకే చోట చేర్చే కొత్త కాంప్లెక్స్‌కు ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం "సేవా తీర్థ్" అని పేరు పెట్టారు. 2014 నుంచి మోడీ ప్రభుత్వం వలసరాజ్యాల చిహ్నాలను తొలగించి, నూతన దృక్పథాన్ని తీసుకురావడానికి కృషి చేస్తున్నది. ఇందులో భాగంగా సౌత్ బ్లాక్‌ను "సేవా తీర్థ్"గా, సెంట్రల్ సెక్రటేరియట్‌ను "కర్తవ్య భవన్"గా, రాజ్‌పథ్‌ను "కర్తవ్య పథ్"గా, రేస్ కోర్స్ రోడ్‌ను "లోక్ కల్యాణ్ మార్గ్"గా మార్చారు.
ప్రధాని మోడీ "సేవా తీర్థ్" , "కర్తవ్య భవన్-1 & 2"లను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సాయంత్రం 6 గంటలకు సేవా తీర్థ్‌లో జరిగే బహిరంగ కార్యక్రమంలో ప్రధాని ప్రసంగించనున్నారు. సేవా తీర్థ్‌లో ప్రధానమంత్రి కార్యాలయం, జాతీయ భద్రతా మండలి సచివాలయం, క్యాబినెట్ సచివాలయాలు ఉంటాయి. కర్తవ్య భవన్‌లో ఆర్థిక, రక్షణ, ఆరోగ్య, విద్య, సాంస్కృతిక సహా పలు కీలక మంత్రిత్వ శాఖలు ఉంటాయి. ఈ కాంప్లెక్స్‌లు డిజిటల్ ఇంటిగ్రేటెడ్ ఆఫీసులు, పర్యావరణ అనుకూలమైన నిర్మాణాలతో ఆధునికంగా రూపొందించబడ్డాయి.
No comments:
Post a Comment