- ఇజ్రాయెల్ రక్షణకు అండగా ఉంటాం
- యుద్ధ ఉద్రిక్తతల మధ్య యూకే ప్రధాని కైర్ స్టార్మర్ కీలక ప్రకటన!
లండన్: పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు ఎగిసిపడుతున్న తరుణంలో బ్రిటన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇరాన్ చేపట్టిన క్షిపణి, డ్రోన్ దాడుల నుంచి ఇజ్రాయెల్‌ను రక్షించేందుకు బ్రిటీష్ రాయల్ ఎయిర్ ఫోర్స్ యుద్ధ విమానాలు రంగంలోకి దిగాయని బ్రిటన్ ప్రధాని కైర్ స్టార్మర్ అధికారికంగా ప్రకటించారు. శనివారం రాత్రి జరిగిన అత్యవసర భేటీ అనంతరం ఆయన మాట్లాడుతూ, మధ్యప్రాచ్య ఆకాశంలో తమ యుద్ధ విమానాలు ప్రస్తుతం రక్షణ కార్యకలాపాల్లో నిమగ్నమై ఉన్నాయని వెల్లడించారు. ఇరాన్ జరిపిన ఈ దాడులు ఈ ప్రాంతంలో అస్థిరతను పెంచుతాయని, దీనిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
ప్రధాని స్టార్మర్ తన ప్రసంగంలో ఇజ్రాయెల్ భద్రతకు బ్రిటన్ పూర్తి అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఇరాన్ తన మిత్రదేశాల ద్వారా , నేరుగా క్షిపణులతో దాడులు చేయడం వల్ల అమాయక పౌరుల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతున్నదని, అందుకే తాము ఈ రక్షణ చర్యలు చేపట్టాల్సి వచ్చిందని వివరించారు. బ్రిటీష్ యుద్ధ విమానాలు ఇప్పటికే ఇరాన్ ప్రయోగించిన పలు డ్రోన్లను కూల్చివేసినట్లు సమాచారం. ఈ ఉద్రిక్తతలు మరింత పెరగకుండా ఉండేందుకు తమ ప్రభుత్వం అంతర్జాతీయ భాగస్వాములతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నదని ఆయన తెలిపారు.
No comments:
Post a Comment