Sunday, 25 October 2026

గాయని శిల్పా రావుకు మద్దతుగా నిలిచిన ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్



న్యూఢిల్లీ:ముంబైలో జరిగిన 'బాలీవుడ్ మ్యూజిక్ ప్రాజెక్ట్' (BMP) సంగీత వేడుకలో జాతీయ అవార్డు గ్రహీత, ప్రముఖ గాయని శిల్పా రావు ప్రదర్శనకు మధ్యలోనే ఆటంకం కలిగించడంపై 'ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్' (AICWA) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తూ సంఘం ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. వేదికపై శిల్పా రావు పాడుతున్న సమయంలో నిర్వాహకులు ఆమె మైక్రోఫోన్, స్టేజ్ లైట్లను బలవంతంగా ఆపివేయడం అత్యంత హేయమని, కళాకారులను అవమానించేలా వ్యవహరించడం ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేసింది.


ఆమె మాట్లాడుతుండగానే మరో కళాకారుడు కుత్లే ఖాన్‌ను వేదికపైకి పంపి పాట పాడించడం తీవ్రమైన అవమానమని సంఘం పేర్కొంది. శిల్పా రావుకు అండగా నిలుస్తామని, ఆమె ఎలాంటి న్యాయపరమైన చర్యలు తీసుకున్నా తమ పూర్తి మద్దతు ఉంటుందని AICWA స్పష్టం చేసింది. కాగా, ఈ ఘటనపై ఇప్పటికే స్పందించిన నిర్వాహకులు క్షమాపణలు కోరగా.. మైక్ నిలిపివేసినప్పటికీ ప్రేక్షకులు తన పేరును నినాదాలతో హోరెత్తించారని, ముంబై ప్రజల ప్రేమ తనకు ఎంతో ధైర్యాన్నిచ్చిందని శిల్పా రావు భావోద్వేగ నోట్ పంచుకున్నారు.

No comments:

Post a Comment

Featured post

బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తున్న సూపర్‌స్టార్ రజినీకాంత్ 'జైలర్ 2'

 ప్రపంచవ్యాప్తంగా రూ. 666 కోట్లకు పైగా వసూళ్లు న్యూఢిల్లీ: సూపర్‌స్టార్ రజినీకాంత్ ప్రధాన పాత్రలో నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్క...