Tuesday, 1 September 2026

ఢిల్లీలో సీపీఐ భారీ ర్యాలీ



  •  ‘మార్పు తప్పనిసరి’ నినాదంతో రామ్‌లీలా మైదానంలో సభ




న్యూఢిల్లీ: భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) ఆధ్వర్యంలో ‘బద్లావ్ జరూరీ హై’ (మార్పు తప్పనిసరి) పేరుతో నేడు ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో భారీ ర్యాలీ నిర్వహించనుంది. దేశంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ప్రజాస్వామ్య విలువలకు ఎదురవుతున్న సవాళ్లపై ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు మార్పు అవసరాన్ని చాటిచెప్పడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పార్టీ తెలిపింది. సీపీఐ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ.. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయినప్పటి నుంచి దేశం నిరంతరం సంక్షోభాలను ఎదుర్కొంటోందని అన్నారు. ఈ సంక్షోభం రోజురోజుకూ మరింత తీవ్రమవుతోందని పేర్కొన్నారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సమాఖ్య వ్యవస్థకు పెరుగుతున్న ముప్పుపై ప్రజల్లో ఆందోళన నెలకొందన్నారు. దేశ ప్రజలు మార్పు కోసం ఎదురుచూస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ‘బద్లావ్ జరూరీ హై’ అనేది కేవలం సీపీఐ నినాదం కాదని, అది భారతదేశ ప్రజల నినాదమని అన్నారు. ప్రజల ఆకాంక్షను ప్రభుత్వానికి తెలియజేయడమే తమ ర్యాలీ ఉద్దేశమని వెల్లడించారు.

No comments:

Post a Comment

Featured post

మూర్తి సార్‌ చేతుల మీదుగా అందుకున్న పత్రం.. నాటి జ్ఞాపకాలు

ఆంధ్రజ్యోతిలో జర్నలిజం విద్యార్థిగా (2007 సెప్టెంబర్‌) లో ప్రయాణం మొదలుపెట్టినప్పుడు అప్పటి మా ఎడిటర్‌ రామచంద్ర మూర్తి సార్‌. ఇంటర్వ్యూలో ఎం...