Tuesday, 8 September 2026

తాతా మధు వ్యాఖ్యలపై కేసీఆర్‌ క్షమాపణ చెప్పాలి.. అక్బరుద్దీన్‌ ఒవైసీ




హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ క్షమాపణ చెప్పాలని ఎంఐఎం శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్‌ ఒవైసీ కోరారు. శాసనసభలో మాట్లాడుతూ.. తెలంగాణకు చెందిన సీనియర్‌ నేత, బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, పదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్‌.. తన పార్టీ ఎమ్మెల్సీ చేసిన వ్యాఖ్యలకు బాధ్యత వహించి క్షమాపణ చెప్పాలని అన్నారు. గతంలో కేసీఆర్‌ శాసనసభ ఉప సభాపతిగా కూడా పనిచేశారని అక్బరుద్దీన్‌ గుర్తుచేశారు. “స్పీకర్‌ గారికి మాత్రమే కాదు.. ఆయన తల్లికి మాత్రమే కాదు.. ఆ వ్యాఖ్యలతో బాధపడిన తెలంగాణలోని ప్రతి తల్లికి కేసీఆర్‌ క్షమాపణ చెప్పాలి” అని అక్బరుద్దీన్‌ ఒవైసీ పేర్కొన్నారు. కేసీఆర్‌ క్షమాపణ చెబితే ఈ వివాదానికి ఇక్కడితో ముగింపు పలకవచ్చని, సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఆయన అన్నారు. సభలో నెలకొన్న పరిస్థితులకు ముగింపు పలికేందుకు కేసీఆర్‌ ముందుకు రావాలని అక్బరుద్దీన్‌ ఒవైసీ ఆకాంక్షించారు.

No comments:

Post a Comment

Featured post

బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తున్న సూపర్‌స్టార్ రజినీకాంత్ 'జైలర్ 2'

 ప్రపంచవ్యాప్తంగా రూ. 666 కోట్లకు పైగా వసూళ్లు న్యూఢిల్లీ: సూపర్‌స్టార్ రజినీకాంత్ ప్రధాన పాత్రలో నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్క...