- బీఆర్‌ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన ఆరోపణలు
హైదరాబాద్ : గత వారం పది రోజులుగా జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే బీఆర్‌ఎస్ అగ్రనాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకుని పెద్ద కుట్ర జరుగుతోందని బీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర ఆరోపణలు చేశారు. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సీనియర్ నేత హరీష్ రావుతో పాటు అగ్రనేతలను భౌతికంగా అంతమొందించేందుకు యత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
"రాష్ట్రంలో జరుగుతున్న వరుస ఘటనలను విశ్లేషిస్తే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులతో పాటు పార్టీకి చెందిన అగ్రనేతలందరినీ మట్టుబెట్టేందుకు ఒక కుట్ర పూరిత ప్రణాళిక రూపుదిద్దుకుందని స్పష్టంగా అర్థమవుతోంది. అందుకే వారి భద్రతను గణనీయంగా తగ్గించారు. వారి నివాసాల వద్ద సరైన బందోబస్తు కూడా కల్పించడం లేదు" అని ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ధ్వజమెత్తారు.
ఇంటెలిజెన్స్ అధికారుల తీరుపై ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు. "మా సీనియర్ నాయకుల చుట్టూ ఇంటెలిజెన్స్ సిబ్బంది సంచరిస్తూ, వారి ప్రాణాలకు హాని కలిగించేలా వ్యవహరిస్తున్నారు. ఈ నెల 7న బీఆర్‌ఎస్ నేతలు తమ హక్కును వినియోగించుకుని అసెంబ్లీలోకి ప్రవేశించడానికి సిద్ధపడినప్పటికీ, వారిని అడ్డుకుని అత్యంత క్రూరంగా దాడులు చేశారు. ఆ తర్వాత వేర్వేరు పోలీస్ స్టేషన్లకు తరలించారు" అని ఆరోపించారు.
No comments:
Post a Comment