- హురున్ రిచ్ లిస్ట్-2026లో అదానీ కుటుంబానికి నంబర్ వన్ స్థానం
- రూ.9.23 లక్షల కోట్లకు అదానీ సంపద.. రూ.8.63 లక్షల కోట్లతో రెండో స్థానంలో అంబానీ
M3M హురున్ ఇండియా రిచ్ లిస్ట్-2026లో గౌతమ్ అదానీ, ఆయన కుటుంబం దేశంలోనే అత్యంత సంపన్నులుగా అగ్రస్థానంలో నిలిచారు. గతేడాది అగ్రస్థానంలో ఉన్న ముకేశ్ అంబానీ, ఆయన కుటుంబాన్ని అదానీ కుటుంబం అధిగమించింది. హురున్ నివేదిక ప్రకారం అదానీ కుటుంబ సంపద 13 శాతం పెరిగి రూ.9.23 లక్షల కోట్లకు చేరుకోగా, అంబానీ కుటుంబ సంపద 10 శాతం తగ్గి రూ.8.63 లక్షల కోట్లుగా నమోదైంది. దీంతో ఇరువురి మధ్య సంపదలో సుమారు రూ.59,400 కోట్ల తేడా నమోదైంది. లక్ష్మీ నివాస్ మిత్తల్, ఆయన కుటుంబం రూ.3.39 లక్షల కోట్ల సంపదతో మూడో స్థానంలో నిలిచింది.
ఈ ఏడాది జాబితాలో భారత్‌లో డాలర్ బిలియనీర్ల సంఖ్య రికార్డు స్థాయిలో 391కి చేరింది. గతేడాదితో పోలిస్తే 27 మంది కొత్తగా ఈ జాబితాలో చేరారు. కృత్రిమ మేధ రంగం నుంచి 19 మంది జాబితాలో చోటు సంపాదించగా, వారిలో 15 మంది కొత్తగా ప్రవేశించారు. క్వాంటమ్ కంప్యూటింగ్ రంగం నుంచి బెంగళూరుకు చెందిన QpiAI అధినేత నాగేంద్ర నాగరాజ్ తొలిసారి జాబితాలోకి వచ్చారు. సంపన్నుల సంఖ్యలో ముంబయి అగ్రస్థానంలో ఉండగా, బెంగళూరు, దిల్లీ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
No comments:
Post a Comment