- యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు
- సీబీఎస్‌ఈ ఓఎస్‌ఎం పోర్టల్ లోపాలను గుర్తించిన యువ సైబర్ సెక్యూరిటీ పరిశోధకుడు
19 ఏళ్ల సైబర్ సెక్యూరిటీ పరిశోధకుడు నిసర్గ అధికారి అరుదైన గుర్తింపు పొందారు. అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో ఆయన పేరును చేర్చారు. యూఎస్ న్యాయ శాఖకు చెందిన ఓ కీలక వ్యవస్థలో సైబర్ సెక్యూరిటీ లోపాన్ని గుర్తించి అధికారులకు సమాచారం అందించడంతో ఈ గుర్తింపు లభించినట్లు నిసర్గ తెలిపారు. అధికారులు ఆ లోపాన్ని పరిశీలించి పరిష్కరించినట్లు ఆయన వెల్లడించారు. అయితే భద్రతా కారణాల దృష్ట్యా ఆ లోపం ఏ వ్యవస్థలో ఉందో, దాని స్వరూపం ఏమిటో వివరాలు వెల్లడించలేదు.
అమెరికా డిఫెన్స్ డిపార్ట్‌మెంట్, మిలిటరీ వ్యవస్థల్లోనూ కొన్ని భద్రతా లోపాలను గుర్తించి సంబంధిత అధికారులకు నివేదించినట్లు నిసర్గ చెప్పారు. వాటిలో కొన్ని ధ్రువీకరించబడ్డాయని, మరికొన్నింటిపై పరిష్కార ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. సైబర్ సెక్యూరిటీపై ఆసక్తితో చిన్న వయసులోనే కోడింగ్ నేర్చుకోవడం ప్రారంభించిన నిసర్గ ఈ ఏడాదే 12వ తరగతి పూర్తి చేశారు. ఆయన కుటుంబంలో సైబర్ సెక్యూరిటీ రంగానికి చెందిన వారు ఎవరూ లేరని తెలిపారు.
ఇక ఈ ఏడాది మేలో నిసర్గ సీబీఎస్‌ఈ ఆన్‌లైన్ సబ్మిషన్ ఆఫ్ మార్క్స్ (OSM) పోర్టల్‌లో భద్రతా లోపాలను గుర్తించడం ద్వారా వార్తల్లో నిలిచారు. విద్యార్థుల సమాధాన పత్రాలకు సరైన ధ్రువీకరణ లేకుండానే యాక్సెస్ లభించే అవకాశం ఉందని గుర్తించి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఆ తర్వాత ఆయనను ఐఐటీ కాన్పూర్‌లోని C3iHubలో ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్, థ్రెట్ ఇంటెలిజెన్స్ ఇంజినీర్‌గా నియమించారు.
No comments:
Post a Comment