Wednesday, 30 September 2026

జీ-20 సదస్సులో పీయూష్ గోయల్: భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందాలపై ఉత్కంఠ



వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ నేడు, రేపు అమెరికాలోని విస్కాన్సిన్ రాష్ట్రం, మిల్వాకీలో జరగనున్న జీ-20 వాణిజ్య మంత్రుల సదస్సులో పాల్గొననున్నారు. అమెరికా వాణిజ్య ప్రతినిధి జేమిసన్ గ్రీర్ ఆహ్వానం మేరకు ఆయన ఈ సమావేశానికి హాజరవుతున్నారు. ఈ పర్యటనలో భాగంగా అమెరికా ప్రతినిధులతో భారత్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై ఆయన కీలక చర్చలు జరపనున్నారు. ముఖ్యంగా ఫిబ్రవరి 7న జారీ చేసిన సంయుక్త ప్రకటనకు అనుగుణంగా మధ్యంతర ఒప్పందాన్ని ఖరారు చేయడంపై ప్రధానంగా దృష్టి సారించనున్నట్లు వాణిజ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

No comments:

Post a Comment

Featured post

రూ.560 కోట్ల అమెరికా సైనిక విమానాన్ని గొడ్డలితో ధ్వంసం చేసిన దుండగుడు.. ఐర్లాండ్‌లో సంచలనం!

ఐర్లాండ్‌లోని షానన్‌ విమానాశ్రయంలో పార్క్‌ చేసి ఉన్న అమెరికా సైనిక రవాణా విమానంపై ఓ వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. గొడ్డలి, ప్రత్యేక రసాయనాన్ని...