Tuesday, 4 February 2025

ప్రజాపాలన వద్దు, ఫామ్‌హౌస్‌ పాలనే కావాలె

పనిమంతుడు పందిరి వేస్తే.. కుక్కతోక తగిలి కూలిపోయిందట.. అట్లనే ఉన్నది రేవంత్‌రెడ్డి పాలన. గత ప్రభుత్వంపై పదేళ్లలో రానంత వ్యతిరేకత ఏడాది ప్రజాపాలనపైనే వచ్చింది. ఎన్నికలకు ముందు మార్పు కోరుకున్న జనాలే మాకొద్దు ఈ బుల్డోజర్‌ పాలన అంటూ రోడ్లెక్కారు. ప్రజాస్వామ్యం, హక్కుల అంటూ ప్రసంగాలు దంచిన రేవంత్‌ రెడ్డే ఇప్పుడు నిరసనలు, ఆందోళనలు సమావేశాలుపై ఉక్కుపాదం మోపుతున్నారు. ప్రశ్నిస్తే కేసులు.. హామీలు అడిగితే అరెస్టులు. 



బీఆర్‌ఎస్‌ ఉండదు, కేసీఆర్‌ను ఆనవాళ్లు కనిపించకుండా చేస్తానని గప్పాలు కొట్టిన ఎనుముల రేవంత్‌రెడ్డికి కాంగ్రెస్‌ పార్టీ సొంత హ్యాండిల్‌లో పెట్టిన సర్వేలో దిమ్మతిరిగే షాక్‌ ఇచ్చారు. తామేదో ప్రజాపాలన సాగిస్తున్నట్లు.. కేసీఆర్‌ పాలన ఫామ్‌ హౌస్‌ పాలన అన్నట్టు ప్రచారం ఆ పోల్‌ పెట్టారు. దీంతో 70 శాతానికి పైగా జనాలు మాకు ప్రజలు లేని ప్రజాపాలన వద్దు, ప్రజా సంక్షేమాన్ని కోరుకునే కేసీఆర్‌ పాలనే కావాలని కుండబద్దలు కొట్టారు. దీంతో ఆగమైన హస్తం పార్టీ నేతలు హడావుడిగా ప్రెస్‌మీట్లు పెట్టి తూచ్‌ ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోవానికి ఆ పోల్‌ పెట్టామని, బీఆర్‌ఎస్‌, బీజేపీ వాళ్లు కలిసి మా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓట్లు వేశారని నాలుక మడతేశారు. ఇంకా నాలుగేళ్లు ఉండగా.. ఇప్పుడే ప్రజాభిప్రాయం ఎందుకు అంటే సమాధానం ఉండదు.ట్విట్టర్ పోల్ ప్రామాణికం కాదు అన్నప్పుడు పార్టీ ఆఫీషల్ అకౌంట్లో  పోల్ ఎందుకు పెట్టారంటే సప్పుడు లేదు. 

No comments:

Post a Comment

Featured post

ముఖ్యమంత్రి మార్పు ఖాయమేనా?

 తెలంగాణ సీఎం ఇటీవల కాలంలో చేస్తున్న వ్యాఖ్యలు విడ్డూరంగా ఉంటున్నాయి. నిన్న వనపర్తి సభలో సీఎం మాట్లాడుతూ.. తెలంగాణకు ఏదో చేయాలనే ఆలోచనతో ప్ర...