Sunday, 23 February 2025

కాంగ్రెస్‌ నేతల వల్ల తెలంగాణకు తీవ్ర అన్యాయం

 దేవరకొండకు కృష్ణా జలాలు వస్తాయని మా మిత్రుడు బెక్కం వేణు చిన్నప్పటి నుంచి ఎదురుచూస్తున్నాడు. దీంతో మా భూములకు డిమాండ్‌ పెరుగుతుందని, మంచి పంటలు పండితే మా తలరాతలు మారుతాయని ఆశించాడు. కానీ దశాబ్దాలుగా ఆ నియోజకవర్గానికి నీళ్లు అందించే ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టు పనులు ఒక్క అడుగు ముందుకు వస్తే నాలుగు అడుగులు వెనక్కి అన్నట్టు తయారయ్యాయి. ఈ ప్రాజెక్టు మొదలుపెట్టిన తీరే పెద్ద కుట్ర అని కేసీఆరే కాదు తెలంగాణ ఇంజినీర్లు అనేకమంది అభిప్రాయం. కానీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, రేవంత్‌ రెడ్డి కేసీఆర్‌ పదేళ్లు పండబెట్టిన ప్రాజెక్టును పరుగులు పెట్టిస్తామని బీరాలు పలికారు. కానీ ఎస్‌ఎల్‌బీసీ సొరంగం పైకప్పు కుప్పకూలింది. అందులో గల్లంతైన 8 మంది ఆచూకీ 48 గంటలైనా జాడలేదు. వాళ్లు సురక్షితంగా బైటికి రావాలని కోరుకుంటున్నారు. కానీ సాంకేతికంగా అనేక సమస్యలతో ముడిపడిన ఈ ప్రాజెక్టుపై కేసీఆర్‌ వాస్తవాలు మాట్లాడితే ఎద్దేవా చేసిన కోమటిరెడ్డి లాంటి వాళ్లకు ఎస్‌ఎల్‌బీసీ సొరంగం  పైకొప్పు కుప్పకూలిన తర్వాత కూడా అర్థం కాలేదు. తెలంగాణ ప్రాజెక్టులపై అవగాహన లేకపోయినా ఫరవాలేదు. కానీ నోటికి ఏది వస్తే అది మాట్లాడే
కాంగ్రెస్‌ నేతల వల్ల తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతున్నది.

No comments:

Post a Comment

Featured post

ఓట్ల తొలగింపుపై అఖిలేశ్ యాదవ్ తీవ్ర ఆగ్రహం.. ఈసీ తీరుపై ప్రశ్నల వర్షం!

  లక్నో: ఓటర్ల జాబితా నుంచి ఓట్లను అక్రమంగా తొలగిస్తున్నారంటూ సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత అఖిలేశ్ యాదవ్ ఎన్నికల సంఘం తీరుపై తీవ్రస్థాయి...