మేడిగడ్డ పునరుద్ధరణ బాధ్యత నిర్మాణ సంస్థదే
మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనలో పునరుద్ధరణ పనులను నిర్మాణ సంస్థే చేయాల్సి ఉండగా ఎందుకు చేయడం లేదు? పని పూర్తి కాకుండానే సర్టిఫికెట్ ఇచ్చిన ఇంజినీర్లపై చర్యలు ఎందుకు తీసుకోలేదు? అని సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. సాగు నీటి శాఖపై సచివాలంలో చేసిన సమీక్షలో పలు ప్రశ్నలు సంధించారు. 'పని పూర్తయితే, నిర్మాణ సంస్థ గడువు పొడిగించాలని ఎందుకు కోరింది? నీటి పారుదల శాఖ ఎందుకు పొడిగించింది? నిర్మాణ సంస్థ సంస్థపైన, బాధ్యులైన ఇంజినీర్లపై ఎందుకు చర్యలు తీసుకోలేదు? మొత్తం రికార్డులన్నీ పరిగణనలోకి తీసుకుని నిర్మాణ సంస్థతోనే పని చేయించాలి అని సీఎం స్పష్టం చేశారు.
నేషనల్ డ్యాం సేఫ్టీ అథార్టీ (ఎన్డీఎస్) ఇచ్చిన మధ్యంతర నివేదిక, వానకాలంలో చేయాలని సూచించిన పనుల గురించి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి దృష్టి తీసుకొచ్చారు. ఈ సమీక్షలో ఉత్తమ్‌తో పాటు మంత్రులు పొంగులేటి, తుమ్మల, కొండా సురేఖా ఉన్నారు. అయితే ఎన్డీఎస్‌పై సుదీర్ఘ చర్చ చేసినట్టు సమాచారం. బ్యారేజీ కుంగుబాటులో బాధ్యులపై క్రిమినల్ చర్యలకు వెనకాడవద్దనీ సీఎం స్పష్టం చేసినట్టు సమాచారం. వచ్చే వారం ప్రాజెక్టు వద్దకు సీఎం వెళ్లనున్నారు.
Comments
Post a Comment