ముందు పార్టీనే నన్ను మోసం చేసింది:నీలేశ్ కుంభానీ
సార్వత్రిక ఎన్నికల్లో సూరత్ స్థానం వార్తలో నిలిచి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి
నీలేశ్ కుంభానీ నామినేషన్ పత్రాలు చివరి నిమిషంలో తిరస్కరణకు గురయ్యాయి. దీంతో ఆయనను హస్తం పార్టీ బహిష్కరించిన విషయం విదితమే. అప్పటినుంచి అజ్ఞాతంలోకి వెళ్లిన ఆయన సుమారు 20 రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ' పార్టీని మోసం చేశానని కొంతమంది కాంగ్రెస్ నేతలు నన్ను తిడుతున్నారు. వాస్తవానికి 2017 అసెంబ్లీ ఎన్నికల్లో కామ్రేజి స్థానం నుంచి చివరి క్షణంలో నన్ను తొలిగించి తొలుత పార్టీనే తప్పు చేసింది. ఇలా చేయాలని నేను అనుకోలేదు. కానీ సూరత్‌లో ఐదుగురు స్వయం ప్రకటిత నేతలే పార్టీని నడుపడంతో నా మద్దతుదారులు, కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. పొత్తులో భాగంగా ఆప్ పార్టీ నేతలతో నేను కలిసి నేను చేసిన ప్రచారాన్ని కూడా ఈ నేతలు తప్పుపట్టారు' అని వ్యాఖ్యానించాడు.
ఇదే స్థానం నుంచి పోటీకి దిగిన 8 మంది అభ్యర్థులు కూడా తమ నామినేషన్లు విత్ డ్రా చేసుకోవడంతో బీజేపీ అభ్యర్థి ముకేశ్ దలాల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
Comments
Post a Comment