Friday, 24 May 2024

అగ్నిపథ్‌తో యువతను మోడీ మోసం చేశారు: రాహుల్‌


సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలని కలలు కన్న యువతను అగ్నిపథ్‌ పథకం బలవంతపు అమలు ద్వారా ప్రధాని మోడీ మోసం చేశారని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండియా కూటమి అధికారంలోకి వచ్చాక యువతకు న్యాయం చేస్తుందని హామీ ఇచ్చారు. సాయుధ బలగాల్లో చేరాలని కోరుకొని, అగ్నపథ్‌ పథకం కారణంగా ఆ అవకాశానికి దూరమైన కొందరు యువకులతో రాహుల్‌గాంధీ ఇటీవల ఓ టెంపో వాహనంలో ప్రయాణిస్తూ మాట్లాడిన సంగతి తెలిసిందే. ఆ వీడియోను రాహుల్‌ సోషల్‌ మీడియా 'ఎక్స్‌' లో పంచుకుని పై వ్యాఖ్యలు చేశారు.

No comments:

Post a Comment

Featured post

పంతానికి పోతే తెలంగాణ రైతాంగానికి తీరని నష్టం

కాళేశ్వరం ప్రాజెక్టులో చిన్నచిన్న లోపాలున్నాయనేది వాస్తవం. దీనిపై అధికార, ప్రతిపక్ష పార్టీ వాదనలు ఎలా ఉన్నా తెలంగాణకు ఎత్తిపోతల పథకాలు తప్ప ...