Friday, 17 May 2024

బీజేపీతో రాజ్యాంగానికి ముప్పు : రాహుల్‌గాంధీ

 


బీజేపీతో రాజ్యాంగానికి ముప్పు పొంచి ఉన్నదని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ ఆరోపించారు. ఆ పార్టీ మూడోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని రద్దు చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. అమేథీలో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి కిషోరీ లాల్‌ శర్మ తరఫున ఎస్పీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ కలిసి రాహుల్‌ ప్రచారం చేశారు. రాజ్యాంగాన్ని రద్దు చేస్తామని అధికారపార్టీ నేతలు బహిరంగ ప్రకటనలు చేస్తున్నందున దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ప్రజలపై ఉందన్నారు.  రాజ్యాంగాన్ని రద్దు చేస్తామంటున్న వారికి ఈ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని రాహుల్‌ గాంధీ ప్రజలకు పిలుపునిచ్చారు. 


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. '2024 ఎన్నికలు ప్రత్యేకమైనవి. మొదటిసారి ఓ రాజకీయపార్టీ, ఆపార్టీ నేతలు రాజ్యాంగాన్ని ఖతం చేస్తామని అన్నారు. అందువల్ల రాజ్యాంగాన్ని రక్షించాల్సి ఉన్నది. ఇదే మీ గొంతుక. నరేంద్రమోడీ రాజ్యాంగాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారు. రాజ్యాంగం రద్దయితే  ప్రభుత్వ రంగ సంస్థలు ఉండవు. ఉద్యోగాలు ఉండవు. ధరలు ఆకాశాన్నంటుతాయి. రిజర్వేషన్లు రద్దవుతాయి. మీ హక్కులన్నీ లాగేసుకుంటారు. వాస్తవం ఏమంటే రాజ్యాంగం లేకుంటే దేశంలోని 22 లేదా 25 మంది సంపన్నులకు మాత్రమే హక్కులుంటాయి. రైతులు, కూలీలు, యువకులు, మహిళల హక్కులు లాగేసుకుంటారు' అని హెచ్చరించారు.

No comments:

Post a Comment

Featured post

ప్రజలు మెచ్చేలా పాలన సాగించాలని పౌర సమాజం కోరిక

సీఎం రేవంత్‌ రెడ్డి వైఖరి నాకు దక్కనిది ఎవరికీ దక్కడానికి వీళ్లేదు అన్నట్టు ఉన్నది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజాస్వామ్యం, పౌర సమాజం, తెలంగా...