ద్విముఖ పోరులో ఏ పార్టీకి అనుకూలం?
తెలంగాణలో రేపు 17 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరగనున్నది. హైదరాబాద్‌లో మినహా మిగిలిన 16 స్థానాల్లోని ముఖాముఖి పోటీ ఉన్న స్థానాల గురించి తెలుసుకుందాం. అక్కడ పార్టీల బలాబలాల గురించి చూద్దాం.
ఖమ్మం: బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ల మధ్య ముఖాముఖి పోరు సాగనున్నది. బీఆర్‌ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వర్ రావు ఒకసారి టీడీపీ తరఫున ఒకసారి బీఆర్‌ఎస్ తరఫున ఇదే నియోజకవర్గంలో గెలిచారు. ఆయనకు నియోజకవర్గవ్యాప్తంగా ఉన్న పరిచయాలు ఆయన బలం. కాంగ్రెస్ పార్టీకి పార్లమెంటు పరిధిలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ గెలువడం కలిసి వచ్చే అంశం. అలాగే అభ్యర్థి రాఘురాంరెడ్డి మంత్రి పొంగులేటికి వియ్యంకుడు కావడం, డిప్యూటీ సీఎం భట్టి, మరో మంత్రి తుమ్మల ఆయన గెలుపు కోసం కృషి చేస్తున్నారు.
భువనగిరి: కాంగ్రెస్, బీజేపీల మధ్యే ప్రధానంగా పోటీ ఉండనున్నది. కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న చామల కిరణ్‌కుమార్‌రెడ్డికి కోమటిరెడ్డి బద్రర్స్ అండదండలున్నాయి. ప్రచార బాధ్యతలను రాజగోపాల్‌రెడ్డి తీసుకున్నారు. బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ ఈ నియోజకవర్గ ఎంపీగా పనిచేయడం, ఆయన అనుభవం, పరిచయాలు ఆయనకు సానుకూల అంశాలు.
పాలమూరు: ఇక్కడ మూడు పార్టీలు పోటీ చేస్తున్నా.. బీజేపీ, కాంగ్రెస్‌లు విజయం కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఈ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ స్థానాలు కాంగ్రెస్‌వే. సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ ఈ పార్లమెంట్ పరిధిలోనే ఉన్నది. దీనిపై ఆయన ఎక్కువగా ఫోకస్ పెట్టారు. బీజేపీ నుంచి డీకే అరుణ పోటీ చేస్తున్నారు. బీజేపీకి మొదటి నుంచి బలం ఉన్న నియోజకవర్గం ఇది. అరుణకు జిల్లా వ్యాప్తంగా అనుచరవర్గం, మోడీ ఛరిష్మా ఆమెకు కలిసి వచ్చే అంశం.
Comments
Post a Comment