Friday, 17 May 2024

ఏపీలో ఎన్నికల హింసపై సిట్‌ ఏర్పాటు


ఏపీలో ఎన్నికల ముందు, తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై సిట్‌ ఏర్పాటైంది. ఐజీ వినీత్‌ బ్రిజ్‌లాల్‌ నేతృత్వంలో 13 మంది సభ్యులతో కూడిన సిట్‌ను ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సిట్‌ సభ్యులుగా ఏసీబీ ఎస్పీ రమాదేవి, ఏసీబీ అదనపు ఎస్పీ సౌమ్యలత, ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి (శ్రీకాకుళం), సీఐడీ డీఎస్పీ శ్రీనివాసులు, ఏసీబీ డీఎస్పీ శ్రీనివాసరావు (ఒంగోలు), ఏసీబీ డీఎస్పీ మనోహరాచారి (తిరుపతి), వి. భూషణం (గుంటూరు రేంజ్‌), వెంకటరావు (విశాఖ ఇంటెలిజెన్స్‌), రామకృష్ణ (ఏసీబీ), జి.ఎల్‌. శ్రీనివాస్‌(ఏసీబీ) ఉన్నారు.




అంతకుముందు ఏపీలో ఎన్నికల తర్వాత జరిగిన హింసపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఆఫీస్‌ ప్రాథమిక విచారణ పూర్తి చేసి ఈసీకి నివేదిక పంపింది. హింసాత్మక ఘటనలపై ఈసీ ఆదేశాల మేరకు ఏర్పాటైన సిట్‌  రెండురోజుల్లో నివేదిక ఇవ్వనున్నట్టు సమాచారం. హింసాత్మక ఘటనలపై ఇప్పటికే ప్రాథమిక విచారణ మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. పల్నాడు, తాడిపత్రి, తిరుపతిలో జరిగిన ప్రతి ఘటనలపైనా సిట్‌ ఈసీకి నివేదిక ఇవ్వనున్నది.

No comments:

Post a Comment

Featured post

ఓట్ల తొలగింపుపై అఖిలేశ్ యాదవ్ తీవ్ర ఆగ్రహం.. ఈసీ తీరుపై ప్రశ్నల వర్షం!

  లక్నో: ఓటర్ల జాబితా నుంచి ఓట్లను అక్రమంగా తొలగిస్తున్నారంటూ సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత అఖిలేశ్ యాదవ్ ఎన్నికల సంఘం తీరుపై తీవ్రస్థాయి...