ఐపీఎల్ 17వ సీజన్ లో కోల్ కతా విజయభేరీ మోగించింది. చెన్నై వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్ లో ప్రత్యర్థి హైదరాబాద్ ను చిత్తుగా ఓడించింది. 114 పరుగుల లక్ష్యాన్ని 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 10.3 ఓవర్లలో ఛేదించింది. ముచ్చటగా మూడోసారి టైటిల్ ను సొంతం చేసుకున్నది. వెంకటేశ్ (52 నాటౌట్) హాఫ్ సెంచరీతో విజృంభించాడు. గుర్బాజ్ (39) ఫోర్లతో విరుచుకుపడ్డాడు. శ్రేయస్ (6 నాటౌట్) బౌండరీతో మెరిశాడు. హైదరాబాద్ బౌలర్లలో షాబాజ్, కమిన్స్ తలో వికెట్ తీశారు. అంతకుముందు టాస్ గెలిచిన బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్ 18.3 ఓవర్లలో 113 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే.
ఇప్పటివరకు నాలుగుసార్లు ఫైనల్ చేరిన ఈ రెండు జట్లు తలో రెండుసార్లు టైటిల్ సాధించాయి. మూడోసారి టైటిల్ సొంతం చేసుకోవడానికి పోటీపడుతున్నాయి.ఐపీఎల్ లో కోల్‌కతా, సన్ రైజర్స్ మధ్య ఇదే మొదటి ఫైనల్.
No comments:
Post a Comment