ప్రజాస్వామ్యంలో ప్రజలకు నిరసన తెలిపే హక్కు రాజ్యాంగం కల్పించింది. కానీ
రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తెలంగాణ ప్రజలకు నిరసన తెలిపే హక్కును
నిరాకరిస్తున్నది. మొన్న ప్రధాన పర్యటన సందర్భంగా, నేడు చంద్రబాబు పాదయాత్ర
సందర్భంగా తెలంగాణవాదులను నిర్బంధించి, వారి గొంతు నొక్కాలని
యత్నిస్తున్నది. తెలంగాణపై బాబు మరోసారి లేఖ రాశారని తెలంగాణ తెలుగు
తమ్ముళ్లు చెబుతున్నారు. కానీ బాబు లేఖలో స్పష్టత లేదని ఈ ప్రాంత నేతలే
కాదు సీమాంధ్ర టీడీపీ నేతలు కూడా చెప్పిన విషయాన్ని గుర్తించుకోవాలి.
బాబుకు ఈ ప్రాంతంలో పర్యటించే హక్కు ఎలా ఉందో ఆయనను నిలదీసే హక్కు కూడా
తెలంగాణ వాదులకు ఉంటుంది. అధికార పార్టీ అండతో తెలంగాణపై దండయాత్ర
చేస్తున్న సీమాంధ్ర నేతలను స్వాగతిస్తున్న ఈ ప్రాంత టీడీపీ
ప్రజాప్రతినిధులకు ఆత్మాభిమానం లేదా? తెలంగాణపై స్పష్టమైన నిర్ణయం
చెప్పమంటే అఖిలపక్షం అని తప్పించుకుంటున్న బాబుకు మీరు వంత పాడడం ఏమిటి?
అంటే మీరు ఆ ప్రాంత ప్రజల ఆకాంక్ష కోసం పనిచేస్తున్నారా? లేక చంద్రబాబు
ప్రాపకం కోసం పరితపిస్తున్నారా తెలియజేయాలి. అయినా జేఏసీ నేతలు ఎక్కడా
చంద్రబాబు పర్యటనను అడ్డుకుంటామని చెప్పలేదు. తెలంగాణపై బాబు వైఖరికి
నిరసనగా తమ నిరసనను తెలిజేస్తామన్నారు. అంది కూడా నేరమేనా?
సీమాంధ్ర నేతల పర్యటన అనగానే ప్రభుత్వం వారికి భారీ బందోబస్తును ఏర్పాటు చేసి తెలంగాణ వాదులను ఎక్కడికక్కడ అరెస్టులు చేసి, నిర్బంధించి ఈ ప్రాంతాన్ని ఒక మిలటరీ క్యాంపుగా మార్చే ప్రయత్నం చేస్తున్నది. ప్రశ్నించడమే అదో మహా పాపం అన్నట్టు కిరణ్ సర్కార్ వ్యవహరిస్తున్నది. అయితే వలసపాలకుల కుటిల నీతి తెలియంది కాదు. దానికి ఈ ప్రాంత కాంగ్రెస్, టీడీపీ నేతలు వంతపాడడమే విషాదం. బాబు పాదయాత్ర ఉద్దేశ్యం ఏమిటి? ప్రజల కష్టాలను తెలుసుకొని వారి అండగా ఉంటామనే భరోసా ఇవ్వడానికి ‘వస్తున్నా మీ కోసం’ అంటూ బయలు దేరారు. మరి ఈ ప్రాంత ప్రజానీకాన్ని నిర్బంధించి, వారి వాక్ స్వాతంత్య్రాన్ని అడ్డుకుంటుంటే ఇక బాబు ఎవరి బాధలు వింటారు. బాబు బాగోతాలు ఈ ప్రాంత టీడీపీ నేతలకు అర్థం కాకపోవచ్చు. కానీ ఈ ప్రాంత ప్రజలకు మాత్రం అది ఎప్పుడో అర్థమైంది. అందుకే బాబు ఇప్పటికి ఎన్నిసార్లు నేను తెలంగాణకు వ్యతిరేకం కాదని మొత్తుకుంటున్నా ఆయనను విశ్వసించడం లేదు. ఒక ప్రధాన ప్రతిపక్షంగా తన బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తే ఇవ్వాళ నాలుగున్న కోట్ల ప్రజానీకం ఇలా రోడ్లపైకి వచ్చేవారు కాదు. స్వరాష్ట్రం కోసం ఇన్ని ఆత్మబలిదానాలు జరిగి ఉండేవికావు. వారి తల్లులకు కడుపుకోతలు మిగిలేవి కావు.
తెలంగాణ ప్రాంత టీడీపీ మాట్లాడితే తెలంగాణకోసం ఎంతటి త్యాగాలకైనా సిద్ధమని ఉరితాళ్లను పట్టుకుని తిరిగారు. మీరు ఎలాగూ చంద్రబాబును తెలంగాణపై నిలదీయలేరు. కనీసం ప్రజలనైనా అ పని చేయనివ్వరా? మొన్నటి దాకా జేఏసీకి మేమున్నాం అని పలికిన టీ టీడీపీ నేతలు ఇప్పుడు ఆ జేఏసీపైనే విమర్శలకు దిగడం వారి ద్వంద్వ నీతికి నిదర్శనం. అంటే వారి అవసరానికి అనుగుణంగా మాటమార్చడం చంద్రబాబు నుంచి నేర్చుకున్నారు. ఇక చంద్రబాబు మహబూబ్‌నగర్‌లో పాత పాటే పాడారు. తాము తెలంగాణకు వ్యతిరేకం కాదంటారు. (వ్యతిరేకం కాదంటే అనుకూలం కాదు). ఈ విషయాన్ని ఇప్పటికే ఎన్నోసార్లు చెప్పామని అన్నారు. మరి డిసెంబర్ 10 ప్రెస్‌మీట్ పెట్టి రాష్ట్రాన్ని విభజించడానికి తమిళనాడుకు చెందిన చిదంబరం, కర్ణాటకు చెందిన వీరప్ప మొయిలీ ఎవరు ఎందుకు ప్రశ్నించారు. సీమాంధ్రలో తెలంగాణకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమాన్ని ఎందుకు అడ్డుకోలేదు? మొదటి రాజీనామాల అస్త్రాన్ని సంధించిన టీడీపీ నేతలను ఎందుకు వారించలేదు? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా రెండు కండ్ల సిద్ధాంతాన్ని ఎందుకు ముందుకు తెచ్చారు. తమరు రెండు కండ్లు అంటే, కాంగ్రెస్ వారు ఏకాభిప్రాయం అంటారు. మరొక పార్టీ ఇచ్చే శక్తి తెచ్చే శక్తి తమకు లేదంటుంది. ఇవి చాలవా తెలంగాణపై మీ వైఖరి ఏమిటో తెలియజేయడానికి. అట్లాగే ఇవ్వాల్సిన కాంగ్రెస్‌ను నిలదీయకుండా మమ్మల్ని నిందించడం ఏమిటని బాబు ప్రశ్నించారు. నిజమే. కేంద్ర చెబుతున్న మాటేమిటో బాబు అండ్ కో కు తెలియదా? రాష్ట్రంలో ఏకాభిప్రాయం లేనిదే తాము తెలంగాణపై ఏమీ చేయలేమని చెప్పిన విషయాన్ని మరిచిపోతున్నారు. మీరు నిజంగా తెలంగాణపై స్పష్టంగా ఉంటే ఈ అంశంపై ఎవరు నాటకం ఆడుతున్నారో ప్రజలకు కూడా అర్థమవుతుంది. ఎవరు ఎవరితో కుమ్మక్కయ్యారో తెలుస్తుంది. అలాగే తెలంగాణపై మీరు రెండోసారి లేఖ రాసిన తర్వాత సీమాంధ్ర ప్రజాప్రతినిధుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. పాదయాత్ర సమయంలో సమైక్యాంధ్ర జేఏసీ మిమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం చేసింది. కానీ అది టీ కప్పులో తుపానే. అయితే తెలంగాణ ప్రాంతంలోకి మీరు అడుగుపెడతారనగానే ఎందుకు ఇంత రచ్చ జరిగింది. టీడీపీ వైఖరి స్పష్టంగా ఉంటే రాజోలి రగడ ఎందుకు జరిగింది. పాలకుర్తిలో ప్రజల నుంచి నిరసన ఎందుకు ఎదురైందో సదరు టీడీపీ నేతలు సమాధానం చెప్పాలి. అట్లనే చంద్రబాబు అఖిలపక్షం అనేకంటే తెలంగాణకు అనుకూలం అంటే వారికి జరిగే నష్టమేమిటో? నిజంగా టీడీపీ ఈ పనిచేస్తే కాంగ్రెస్‌తో కేసీఆర్ కుమ్మక్కయ్యారో, లేక చంద్రబాబు కాంగ్రెస్‌తో చేసుకున్న చీకటి ఒప్పందం ఆరోపణలు ఏమిటో అందరికి అర్థమవుతాయి.

No comments:
Post a Comment