Tuesday, 12 May 2026

హార్ముజ్ జలసంధి పరిధిని పెంచిన ఇరాన్


  • 500 కిలోమీటర్ల మేర 'ఆపరేషనల్ జోన్'గా ప్రకటన
  • అంతర్జాతీయ నౌకాయానానికి ఐఆర్జీసీ కొత్త సవాల్



టెహ్రాన్‌: ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధి విషయంలో ఇరాన్ తన వ్యూహాన్ని మార్చింది. ఈ జలసంధి భౌగోళిక పరిమితులను తాము పునర్నిర్వచించామని, ఇకపై దీనిని 500 కిలోమీటర్ల మేర 'క్రియాశీల కార్యకలాపాల జోన్'  గా పరిగణిస్తామని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ) సంచలన ప్రకటన చేసింది. గతంతో పోలిస్తే ఈ జలసంధి పరిధి ఇప్పుడు మరింత విస్తరించిందని, ఈ ప్రాంతంలో జరిగే ప్రతి కదలికను తాము పర్యవేక్షిస్తామని ఐఆర్జీసీ అధికారులు స్పష్టం చేశారు. ఈ నిర్ణయంతో పర్షియన్ గల్ఫ్ , ఒమన్ గల్ఫ్ మధ్య ఉన్న వ్యూహాత్మక మార్గంపై ఇరాన్ తన పట్టును మరింత బిగించినట్లయింది. ఇరాన్ తీసుకున్న ఈ నిర్ణయం అంతర్జాతీయ వాణిజ్యం , భద్రతపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్త ముడిచమురులో మూడింట ఒక వంతు ఈ మార్గం గుండానే రవాణా అవుతుండటంతో, ఇరాన్ ప్రకటించిన ఈ 500 కిలోమీటర్ల జోన్ పశ్చిమ దేశాలకు, ముఖ్యంగా అమెరికాకు పెద్ద సవాల్‌గా మారింది. ఈ ప్రాంతంలో సంచరించే విదేశీ యుద్ధ నౌకలు , వాణిజ్య నౌకలు తమ అనుమతి లేదా నిబంధనలకు లోబడి ఉండాలని ఇరాన్ పరోక్షంగా హెచ్చరిస్తోంది. ఇప్పటికే మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ, హార్ముజ్ జలసంధిని ఒక ఆపరేషనల్ జోన్‌గా మార్చడం ఉద్రిక్తతలను మరింత పెంచుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

No comments:

Post a Comment

Featured post

ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్‌ కు అరుదైన గౌరవం

అకాడమీ ఆఫ్ అచీవ్‌మెంట్’ అవార్డు ప్రదానం ‘గోల్డెన్ ప్లేట్’ పురస్కారం అందుకున్న భారతీయ సంగీత మాంత్రికుడు కళలు, సైన్స్ రంగాల్లో విశేష కృషికి ఇచ...