Saturday, 23 May 2026

లద్దాఖ్‌ లో కూలిన ఆర్మీ హెలికాప్టర్‌


  • వైరల్‌అయిన  శిథిలాల వద్ద ఆర్మీ అధికారుల వైరల్ సెల్ఫీ 



లేహ్:  ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకుని  'విక్టరీ' మార్క్ చూపించిన భారత ఆర్మీ అధికారుల సెల్ఫీ ఒకటి ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది. తూర్పు లడఖ్‌లోని లేహ్ సమీపంలో మే 20న భారత సైన్యానికి చెందిన ఒక 'చేతక్' హెలికాప్టర్ ఘోర ప్రమాదానికి గురైంది. చైనా సరిహద్దులోని లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (ఎల్‌ఏసీ)కు అత్యంత సమీపంలో ఉన్న టాంగ్‌స్టే అనే పర్వత ప్రాంతంలో ఈ సింగిల్ ఇంజిన్ హెలికాప్టర్ కూలిపోయింది. ఈ హెలికాప్టర్ ప్రమాదం జరిగిన సమయంలో అందులో భారత ఆర్మీ 3 ఇన్‌ఫాంట్రీ డివిజన్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్ మేజర్ జనరల్ సచిన్ మెహతాతో పాటు ఒక లెఫ్టినెంట్ కల్నల్, ఒక మేజర్ (పైలట్లు) ప్రయాణిస్తున్నారు. నిగూఢమైన పర్వత ప్రాంతం, సముద్ర మట్టానికి అత్యంత ఎత్తులో ఉండే పలచని గాలి కారణంగా హెలికాప్టర్ అదుపుతప్పి పర్వత శ్రేణులపై కూలిపోయింది. అయితే, ఈ భీకర ప్రమాదం నుంచి ముగ్గురు అధికారులు కేవలం స్వల్ప గాయాలతో ప్రాణాలతో బయటపడటం నిజంగా ఒక అద్భుతమని రక్షణ శాఖ అధికారులు అభివర్ణించారు. ప్రమాదం జరిగిన కొద్దిసేపటికే, పర్వతాలపై పడి ఉన్న హెలికాప్టర్ శిథిలాల పక్కనే గాయాలతో ఉన్న మేజర్ జనరల్ సచిన్ మెహతా ,పైలట్లు ఒక సెల్ఫీ దిగారు. అందులో ఒక పైలట్ 'విక్టరీ'సంకేతాన్ని చూపించడం విశేషం. 

No comments:

Post a Comment

Featured post

లార్డ్స్ టెస్టులో టీమిండియా చరిత్రాత్మక విజయం

ఇంగ్లాండ్‌ను 270 పరుగుల తేడాతో చిత్తు చేసిన భారత్ పరాజయంతో అంతర్జాతీయ క్రికెట్‌కు హెథర్ నైట్, టామీ బ్యూమాంట్ వీడ్కోలు లండన్:  ఐకానిక్ లార్డ్...