Sunday, 3 May 2026

దేశవ్యాప్తంగా ఉత్కంఠగా ఓట్ల లెక్కింపు



  •  823 స్థానాల్లో ఎవరిది గెలుపు
  • పటిష్ట భద్రత మధ్య ప్రారంభమైన కౌంటింగ్ ప్రక్రియ

నిర్ణీత సమయం ప్రకారం ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుతో ఈ ప్రక్రియ మొదలైంది, అనంతరం 8:30 గంటల నుంచి ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. పశ్చిమ బెంగాల్‌లో 293 స్థానాలకు (ఫాల్టా మినహా), తమిళనాడులో 234, కేరళలో 140, అస్సాంలో 126 , పుదుచ్చేరిలో 30 స్థానాలకు ఫలితాలు వెలువడనున్నాయి. ఎన్నికల సంఘం లెక్కింపు కేంద్రాల వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేయడమే కాకుండా, తొలిసారిగా క్యూఆర్ కోడ్ ఆధారిత ఫొటో ఐడెంటిటీ కార్డుల ద్వారా ప్రవేశాలను నియంత్రిస్తోంది. ఫలితాలను ఈసీఐనెట్ (ECINET) ప్లాట్‌ఫామ్ , అధికారిక పోర్టల్ ద్వారా ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తున్నారు.  లెక్కింపు ప్రారంభం కాగానే పశ్చిమ బెంగాల్‌లోని పలు ప్రాంతాల్లో రాజకీయ ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. భవానీపూర్ వంటి కీలక నియోజకవర్గాల లెక్కింపు కేంద్రాల వద్ద ఫైళ్లు, పెన్నులు అనుమతించే విషయంలో టీఎంసీ , బీజేపీ ఏజెంట్ల మధ్య వాగ్వాదం జరిగింది. బెంగాల్‌లో మమతా బెనర్జీ నాలుగోసారి అధికారాన్ని ఆశిస్తుండగా, బీజేపీ చారిత్రక విజయంపై ధీమాగా ఉంది. కేరళలో వరుసగా ప్రభుత్వాలు మారే ఆనవాయితీని బ్రేక్ చేస్తూ ఎల్‌డీఎఫ్ మళ్ళీ వస్తుందా లేదా యూడీఎఫ్ పుంజుకుంటుందా అనేది తేలనుంది. తమిళనాడులో డీఎంకే ఆధిపత్యం కొనసాగుతుందా లేక విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభావం చూపుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది.  

No comments:

Post a Comment

Featured post

బెంగాల్‌లో 'కమలం' వికసిస్తోంది

తమిళనాడులో విజయ్ ప్రభంజనం కేరళలో కాంగ్రెస్ పునరాగమనం భారతదేశ రాజకీయ గమనాన్ని మార్చే ఈ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ అనూహ్య రీతిలో దూసు...