Monday, 2 March 2026

హర్ముజ్ జలసంధిని మూసేసిన ఇరాన్

  •  ప్రపంచానికి చమురు సెగ
  • ‘నౌకలు వస్తే నిప్పు పెడతాం’ అంటూ భీకర హెచ్చరిక

టెహ్రాన్: పశ్చిమాసియా యుద్ధం ఇప్పుడు ప్రపంచ దేశాల ఇంధన భద్రతను ప్రమాదంలోకి నెట్టింది. అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో తమ సుప్రీం నేత ఆయతుల్లా అలీ ఖమేనీ మరణించడంతో రగిలిపోతున్న ఇరాన్, కీలకమైన హర్ముజ్ జలసంధిని (Strait of Hormuz) పూర్తిగా మూసివేస్తున్నట్లు సంచలన ప్రకటన చేసింది. నిబంధనలు అతిక్రమించి ఏ నౌక అయినా ఈ మార్గంలో ప్రవేశించడానికి ప్రయత్నిస్తే వాటిని తగులబెడతామని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ హెచ్చరించారు. ఈ ప్రకటనతో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి.



ప్రపంచ చమురు రవాణాలో ఐదో వంతు వాటా కలిగిన హర్ముజ్ జలసంధిని ప్రపంచ దేశాల ఇంధన జీవనాడిగా పరిగణిస్తారు. కేవలం కొన్ని కిలోమీటర్ల వెడల్పు ఉండే ఈ మార్గం గుండానే భారత్, చైనా, జపాన్ , దక్షిణ కొరియా వంటి దేశాలకు అత్యధికంగా చమురు, సహజ వాయువు (LNG) సరఫరా అవుతుంది. తాజా హెచ్చరికలతో ఇప్పటికే 150కి పైగా ఆయిల్ ట్యాంకర్లు సముద్రం మధ్యలోనే నిలిచిపోయాయి. రవాణా నిలిచిపోవడంతో ఇన్సూరెన్స్ , షిప్పింగ్ ఖర్చులు భారీగా పెరగనున్నాయి. ఇది పరోక్షంగా నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలకు దారితీసి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను గజగజలాడిస్తోంది. ఇరాన్ తీసుకోబోయే తదుపరి చర్యలపై అగ్రరాజ్యాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

No comments:

Post a Comment

Featured post

ప్రజాస్వామ్య సంగ్రామంలో మహిళా గర్జన

బెంగాల్, తమిళనాడు తొలి దశ పోలింగ్‌లో 1947 తర్వాత సరికొత్త చరిత్ర పురుషుల కంటే 2 శాతం అధికంగా మహిళల ఓటింగ్ న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉత్కంఠ ర...