‘చంద్రకిరణాల’ విశ్వాసం
రాష్ట్ర ప్రభుత్వంపై టీఆర్‌ఎస్, వైఎస్‌ఆర్‌సీపీ, బీజేపీ, వామపక్షాలు, లోక్‌సత్తా ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. ప్రధాన ప్రతిపక్షం అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇచ్చి ఉంటే రాష్ట్ర ప్రభుత్వం పడిపోయేది అన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. అయితే రాష్ట్రంలో ఒక వింత పరిస్థితి కొనసాగుతున్నది. అధికార, ప్రతిపక్ష పార్టీల ఉమ్మడి సమస్య తెలంగాణ. ఆ తర్వాత వైఎస్‌ఆర్‌సీపీ పార్టీ. ఇప్పటికిప్పుడు అధికార పార్టీ పడిపోయి, ఎన్నికలు వస్తే టీఆర్‌ఎస్, వైఎస్‌ఆర్‌సీపీలకు లబ్ధి చేకూరుతుందని, అందుకే చంద్రబాబు అవిశ్వాస తీర్మాన సమయంలో తటస్థంగా ఉన్నారు. ఇది బాబు వ్యూహాత్మక వైఖరి అని అనుకుంటున్నారు. కానీ చంద్రబాబు అనాలోచిత నిర్ణయాల వల్ల మొన్న ఆ పార్టీ నేత దాడి వీరభద్రరావు అన్నట్టు ఆ పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. దాడి అన్నట్టు ఆయన పాదయాత్ర రెండువేల కిలోమీటర్లు దాడితే మొన్న ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎన్నిక సమయంలో, ఇప్పుడు అసెంబ్లీలో పార్టీ వైఖరి ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపాయి. ఈ ప్రభుత్వం పూర్తికాలం కొనసాగితే సాధారణ ఎన్నికలకు ఇంకో ఏడాది సమయం ఉన్నది కదా, అప్పటికి టీడీపీ చారిత్రక తప్పిదాలను