Sunday, 15 June 2025

దానం నాగేందర్ వర్సెస్‌ కార్పొరేటర్ విజయా రెడ్డి


కాంగ్రెస్‌ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ. అందుకే ఎవరూ ఏమైనా మాట్లాడుతారనే నానుడి ఉండనే ఉన్నది. దాన్ని అప్పుడప్పుడు పార్టీ నేతలు నిజం చేస్తుంటారు. ఖైరతాబాద్‌ టికెట్‌ ఆశించిన దివంగత జనార్ధన్‌ రెడ్డి కూతురు కార్పొరేటర్‌ విజయారెడ్డి బీఆర్ఎస్‌పై అసంతృప్తితో హస్తం గూటికి చేరారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తరఫున పోటీ చేసిన విజయారెడ్డి బీఆర్‌ఎస్‌ అభ్యర్థి దానం నాగేందర్‌ చేతిలో 22,010 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అనంతరం మారిన రాజకీయ పరిణామాలతో ఆయన కారు దిగి కాంగ్రెస్‌లో చేరారు. అప్పటి నుంచి ఖైరతాబాద్ కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు నడుస్తున్నది.  దానం నాగేందర్ , కార్పొరేటర్ విజయా రెడ్డి అనుచరులు బాహాటంగానే ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. నేడు కూడా బంజారాహిల్స్ లేక్ వ్యూలో జరిగిన నియోజకవర్గ స్థాయిసభలో  దానం నాగేందర్‌, విజయా రెడ్డిల మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నది. దీంతో ఇరువర్గాల అనుచరులు పోటాపోటీగా నినాదాలు చేశారు. ఈ పరిణామాలు చూసిన డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి క్రమశిక్షణ లేకుండా వ్యవహరిస్తున్నారని అసంతృప్తితో అక్కడి నుంచి వెళ్లిపోయారు.

No comments:

Post a Comment