Monday, 30 June 2025

పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వలేం




బనకచర్లపై వివాదం కొనసాగుతున్న సమయంలో ఏపీ, తెలంగాణ ఎవరి శక్తి మేరకు వాళ్లు ప్రాజెక్టులు కట్టుకుందాం ఏపీ సీఎం చంద్రబాబు కొన్నిరోజుల కిందట అన్నారు. కేంద్రంలో మా మద్దతు తోనే మోడీ ప్రభుత్వం నడుస్తున్నదని మేము ఏమీ చెప్పినా నడుస్తుంది అని నారా వారు భావించారు.  గోదావరి లో మిగులు జలాలు లేకున్నా చంద్రబాబు సముద్రంలో కలిసే నీటినే వాడుకుంటామని చెప్తూ చేసిన కుట్రలను బీఆర్ఎస్ పసిగట్టి ఎండగట్టింది. దీన్ని అడ్డుకోవాల్సిన సీఎం  రేవంత్ రెడ్డి మాత్రం కేసీఆర్‌ మీద పడి ఏడ్చాడు.  తెలంగాణ నీటిని ఏపీకి తరలించుకుపోండని కేసీఆర్‌ వదిలేశారని రేవంత్‌రెడ్డి వాదించారు. ఇది తెలంగాణ వాడు ఎవడైనా నమ్ముతాడా?  అబద్ధమాడితే అతికినట్టు ఉండాలి కదా!


కానీ బనకచర్ల వల్ల తెలంగాణ రాష్ట్రానికి జరిగే అన్యాయంపై కేసీఆర్‌, బీఆర్‌ఎస్‌ వాదనను  కేంద్ర పర్యావరణ నిపుణుల కమిటీ పరిగణనలోకి తీసుకున్నది. పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వలేమని కుండబద్దలు కొట్టింది. ప్రాజెక్టుపై అనేక అభ్యంతరాలు వచ్చాయని, అనుమతులు ఇవ్వాలంటే గోదావరి వాటర్‌ డిస్ప్యూట్ ట్రైబ్యునల్‌ (జీడబ్ల్యూడీటీ) తీర్పును పరిశీలించాల్సి ఉందని స్పష్టం చేసింది. పర్యావరణ అనుమతులకు సీడబ్ల్యూసీని సంప్రదించడం అత్యవసరమని కమిటీ అభిప్రాయపడింది.


బడితె ఉన్నవాడిదే బర్రె అనే రోజులు పోయాయి బాబు. మీరు ఏది అనుకుంటే అది జరిగిపోవడానికి ఇది ఉమ్మడి రాష్ట్రం కాదన్న విషయాన్ని గుర్తించుకోవాలి. మీ సహచరుడు మీకు పరోక్షంగా సహరించినా తెలంగాణ నీటి హక్కుల విషయంలో కేసీఆర్‌ది, బీఆర్‌ఎస్‌ది ఎప్పుడూ రాజీలేని పోరాటమే. ఇక్కడి ప్రజల చైతన్యంతో బనకచర్ల విషయంలో కేంద్రం ఏపీకి అనుమతి ఇవ్వకుండా వెనకడుగు వేసింది. అయితే ఈ విజయం పాక్షికమే. బాబు కుట్రలపై నిత్యం అప్రమత్తంగా ఉండాలి. 


No comments:

Post a Comment