Saturday, 14 June 2025

వృత్తిలో నా కృషికి దక్కిన గౌరవం

ఆంధ్రజ్యోతిలో జర్నలిజం విద్యార్థిగా మొదలైన నా ప్రస్థానం  ఆ తర్వాత నమస్తే తెలంగాణలో సుమారు దశాబ్దకాలం పాటు సాగింది. తెలంగాణ ఉద్యమ సమయంలో కీలక ఘట్టాల అన్నింటిపై వ్యాసాలురాసే అవకాశం నాకు దక్కింది. అలాగే నేను రాయగలను అని మొదటిసారి గుర్తించి కీ.శే. కార్టూనిస్టు శేఖర్ గారు. వారు నేను రాసిన చిన్న ఆర్టికల్ జనపక్షం జంగారెడ్డి కి పంపారు. అలా మొదటిసారి నా పేరుతో ఒక ఆర్టికల్ పబ్లిష్ అయింది. అప్పటి నుంచి ప్రధాన పత్రికలతో పాటు, జనం సాక్షి, జన పక్షం, వెలుగు, మిషన్ తెలంగాణ, విధాత, తెలుగు స్క్క్రైబ్, తెలుగు గ్లోబల్ ఇలా అనేక వేదికల ద్వారా నా అభిప్రాయాలు రాసిన. ఆయా యాజమాన్యాలు నాకు అందించిన సహకారానికి ధన్యవాదాలు. 

అలాగే జర్నలిజం స్కూల్ లో ఉన్నప్పుడు ఆంధ్రజ్యోతి మాజీ ఎడిటర్ మాకు క్లాసులు చెప్పేవారు. అప్పటికి ఆయన ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా ఉన్నారు. ఆ సమయంలోనే వివిధ అంశాలపై మీ అభిప్రాయాలు రాసుకోండి.  అయితే అందరికీ ప్రధాన పత్రికల్లో స్పేస్ దొరకకపోవచ్చు. కానీ సోషల్ మీడియాలో పోస్టు చేసుకోవచ్చు అని సూచించారు. అప్పటికి ఆర్కూట్, గూగుల్ ఫ్లస్ వంటివి ఉన్నాయి. ఆ తర్వాత ఫేస్ బుక్, ట్విటర్, ఇన్ స్టా, లింక్ డిన్ లాంటివి అనేకం వచ్చాయి. ఉద్యమసమయంలో సోషల్ మీడియాతో పాటు నా బ్లాగ్ లో వాటిని పోస్టు చేసే వాడిని. వివిధ పత్రికలకు రాసినవి కూడా ఇందులో పోస్టు చేసే వాడిని. ఈ బ్లాగ్ క్రియేట్ చేసింది.  దీనికి సంబంధించి అవగాహన కల్పించింది మిత్రుడు బీ రెడ్డి నగేశ్ రెడ్డి. మిత్రుడికి ధన్యవాదాలు.


ఈ పాత్రికేయ ప్రయాణంలో అనేక ఉత్థానపతనాలు చూసిన. అయితే వేణుగోపాలస్వామి, జ్యోతింద్రనాథ్ గార్లు నాకు మంచి సహకారాన్ని అందించారు. ఎడిటింగ్ విషయంలో, వివిధ అంశాలపై నాకు అవగాహన కల్పించారు. వారికి ధన్యవాదాలు. ఈ మొత్తం ప్రయాణంలో నమస్తే తెలంగాణ లో పనిచేస్తేనే అదే  సమయంలో రైతుబడి పేజీ చూసే బాధ్యత మా అప్పటి ఎడిటర్ కట్టా శేఖర్ రెడ్డి నాకు కల్పించారు. ఎడిట్ పేజిలో ఆర్టికల్ రాయమని అల్లం నారాయణ సార్, శేఖర్ రెడ్డిలు ప్రోత్సహించారు. ఉద్యమ సమయంలో తెలంగాణ వాదాన్ని వినిపించడం, రైతు బడి ద్వారా సాగు సమస్యలతో పాటు, రైతుల సక్సెస్ స్టోరీలో అనేకం రాసిన. మొన్న ఎన్నికల సమయంలో విధాతలో లోక్ సభ, అసెంబ్లీ  ఎన్నికలపై అనేక విశ్లేషణలు రాసిన. నన్ను ఎంకరేజ్ చేసిన కోటి రెడ్డి, జగన్ అన్నలకు థ్యాంక్స్. ఇక గత ఏడాది కాలంగా తెలుగు గ్లోబల్ లో వివిధ అంశాలపై నా అభిప్రాయాలు రాస్తున్న. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలతో పాటు ప్రభుత్వం చేస్తున్న మంచి పనులపై అనేకం రాసిన. నాకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చిన సరిత మేడమ్, మా కామెర నవీన్ లకు కృతజ్ఞతలు.  ఈ మొత్తం పదిహేడు ఏండ్ల ప్రయాణంలో రైతు నేస్తం వాళ్లు ఇచ్చిన అవార్డు తర్వాత వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా వాళ్లు ఇచ్చి అవార్డులు వృత్తిలో నా కృషికి గౌరవంగా భావిస్తాను. 

పనిచేయడమే తప్పా, ఎన్నడూ ఏ గుర్తింపు కోరుకోలేదు. అందుకే  ఇప్పటివరకు నా గురించి రాసుకోలేదు. ఇన్నేండ్ల తర్వాత వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా అవార్డు ఇచ్చిన తర్వాత ఒకసారి మననం చేసుకుని వాటన్నింటినీ అక్షర రూపంలో పెట్టిన.  ఈ అవార్డుకు నా పేరు ప్రతిపాదించిన రాణా ప్రతాప్ అన్నకు, నిత్యం నాకు అండగా ఉండే డాక్టర్ పారిపెల్లి శంకర్, డాక్టర్ ఎర్రోజు శ్రీనివాస్, డాక్టర్ పడాల లక్ష్మణ్, బెక్కం వేణు లకు శనార్థులు. నేను పనిచేసినా,  నేనంటే ఇష్టపడే మా కుటుంబసభ్యులందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు. అవ్వ కు స్పెషల్‌ థ్యాంక్స్‌. ఇక ఇవాళ ఫాదర్స్‌ డే అంట కదా. నాకే మా అందరికీ రోల్‌ మోడల్‌ మా నాయన కొమరయ్య.  ఈ చిన్న అవార్డు నాయనకు అంకితం. 

ఇట్లు S/o ఆసరి కొమురయ్య

- ఆసరి రాజు, ఇండిపెండెంట్‌ జర్నలిస్ట్‌


No comments:

Post a Comment