Raju Asari

Tuesday, 10 June 2025

ప్రజలను దోచుకోవడానికి ప్రభుత్వం అలవాటు పడింది



ఆర్టీసీ బస్‌పాస్‌ ధరల పెంపునకు నిరసనగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో జాగృతి కార్యకర్తలు బస్‌భవన్‌ను ముట్టడించారు. పెంచిన ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు కవితను అరెస్ట్‌ చేసి చంద్రాయణగుట్ట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం బస్‌పాస్‌ ధరలు పెంచి ప్రజలపై పెనుభారం మోపిందన్నారు. ‘‘ప్రభుత్వం నిర్ణయంతో విద్యార్థులు, చిరుద్యోగులపై ఆర్థిక భారం పడుతుంది. ఈ పెంపుతో ఒక్కో ప్రయాణికుడిపై నెలకు దాదాపు రూ.300కిపైగా భారం పడుతుందని అంచనా. ప్రజలను దోచుకోవడానికి ప్రభుత్వం అలవాటు పడింది. అనేక రూట్లలో విద్యార్థుల కోసం బస్సులు నడపడం లేదని ఫిర్యాదులున్నాయి’’అని కవిత అన్నారు. 

No comments:

Post a Comment