Raju Asari

Thursday, 5 June 2025

తెలంగాణ కేబినెట్‌ నిర్ణయాలివే..

  • ఉద్యోగులకు రెండు డీఏలు చెల్లించాలని కేబినెట్‌ నిర్ణయించించి. ప్రస్తుతం ఒక డీఏ, ఆరునెలల తర్వాత మరో డీఏ చెల్లిస్తాం.
  • రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థిక భారం పడుతున్నప్పటికీ ఉద్యోగులకు మేలు చేసే విధంగా క్యాబినెట్‌ నిర్ణయాలు
  • ఉద్యోగుల ఆరోగ్య బీమాకు సంబంధించి ట్రస్ట్‌ ఏర్పాటు చేస్తాం. బీమాకు ఉద్యోగులు ప్రతినెలా రూ.500చెల్లిస్తే.. ప్రభుత్వం కూడా కొంత చెల్లిస్తుంది. ఉద్యోగులు, ప్రభుత్వం చెల్లించే డబ్బులను ట్రస్టులో జమ చేస్తాం. ఉద్యోగులకు ఏవైనా ఆరోగ్య ససమస్యలు వస్తే ట్రస్టు ద్వారా డబ్బులు చెల్లిస్తాం.
  • ఉద్యోగులకు సంబంధించిన బిల్లుల పెండింగ్‌ బకాయిలను నెలకు రూ.700 కోట్లకు తగ్గకుండా చెల్లిస్తాం. పెండింగ్‌ బకాయిలను నెలల వారీగా క్లియర్‌ చేస్తాం.
  • గతేడాది 385 మంది మహిళా స్వయం సహాయక బృంద సభ్యులు మరణించారు. మహిళా స్వయం సహాయక బృంద సభ్యులు మరణిస్తే రూ.10లక్షలు ఇచ్చేందుకు నిర్ణయం.
  • కొత్తగూడెంలోని ఎర్త్‌ సైన్స్‌ వర్సిటీకి మన్మోహన్‌సింగ్‌ పేరు పెట్టేందుకు క్యాబినెట్‌ నిర్ణయం
  • హోమ్‌ విధానంలో రోడ్ల ఆధునికీకరణ చేపట్టాలని కేబినెట్‌ నిర్ణయించింది. ఆర్‌అండ్‌బీ పరిధిలో 5,100 కి.మీ, పంచాయతీరాజ్‌ పరిధిలో 7,947 కి.మీ రహదారులు ఆధునికీకరణ.
  • రూ.19,575 కోట్లతో సుమారు 86 కి.మీ మెట్రో నిర్మాణానికి కేబినెట్‌ నిర్ణయం


No comments:

Post a Comment

Featured post

రేవంత్‌ రాజకీయాలకు కోదండరామ్‌ బద్నాం

'కొంతమంది తమకు తాము ఎక్కువగా ఊహించుకుంటారు' అనిప్రొఫెసర్‌ కోదండరామ్‌ను ఉద్దేశించి కేసీఆర్‌ అప్పట్లో ఓ కామెంట్‌ చేశారు. దీనిపై చాలామం...