Friday, 6 June 2025

కాళేశ్వరం కమిషన్ ప్రశ్నలు- ఈటల జవాబులు

  • ఆర్థిక మంత్రిగా ఎంతకాలం పనిచేశారు?: కాళేశ్వరం కమిషన్
  • మేడిగడ్డ అన్నారం సుందిళ్ల బ్యారేజీల నిర్మాణం చేయాలని ఎవరు నిర్ణయం తీసుకున్నారు?: కాళేశ్వరం కమిషన్
  • టెక్నికల్ టీం రిపోర్టుల ఆధారంగా సబ్ కమిటీ నిర్ణయం మేరకు.. కేబినెట్ నిర్ణయం తీసుకుంది: ఈటల
  • కేబినెట్ నిర్ణయం తీ
    సుకున్న తర్వాతే మూడు బ్యారేజీల నిర్మాణం మొదలుపెట్టాం: ఈటల
  • కేంద్ర జలసంఘం, మహారాష్ట్ర నుంచి అభ్యంతరాలతో తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు మార్చాం: ఈటల మహారాష్ట్ర ఒప్పుకోకపోవడంతో 150 నుంచి 148 కుదించాం: ఈటల
  • మూడు బ్యారేజీలు ఎవరి ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకున్నారు?: కాళేశ్వరం కమిషన్
  • కేబినెట్ నిర్ణయం తీసుకుంది.. తర్వాతే నిర్మాణం జరిగింది: ఈటల
  • రీ డిజైన్ చేయాలని ఎవరు ఆదేశించారు?: కాళేశ్వరం కమిషన్
  • మహారాష్ట్ర అభ్యంతరం చెప్పడంతో సీఎం కేసీఆర్ సబ్ కమిటీ వేశారు: ఈటల
  • హరీష్ రావు చైర్మన్గా.. సబ్ కమిటీలో నేను, తుమ్మల నాగేశ్వరరావు ఉన్నాం: ఈటల
  • ఎక్స్ పర్ట్‌ కమిటీ, టెక్నికల్ కమిటీ, సబ్ కమిటీ నిర్ణయం మేరకు రీ డిజైన్ జరిగింది: ఈటల
  • రీ డిజైన్ చేయడానికి సబ్ కమిటీ సంతకం చేసిందా? : కాళేశ్వరం కమిషన్
  • రీ డిజైన్ కోసం సబ్ కమిటీ సంతకం చేసింది: : ఈటల
  • బ్యారేజీ నిర్మాణ ప్రదేశాలు ఎందుకు మార్చారు?: కాళేశ్వరం కమిషన్
  • టెక్నికల్ డిటైల్స్ మీద మాకు అవగాహన ఉండదు.. అంతా నిపుణులే చూసుకున్నారు: ఈటల
  • నిర్మాణ వ్యయం ఎంత అయ్యింది?: కాళేశ్వరం కమిషన్
  • తొలుత రూ. 63 వేల కోట్లతో అనుకున్నాం. తర్వాత అది రూ.83 వేల కోట్లకు పెరిగింది. ఇప్పుడు ఎంత ఖర్చు అయ్యిందో నాకు తెలియదు: ఈటల
  • బ్యారేజీ నిర్మాణంలో ఆర్థిక క్రమశిక్షణ లోపించిందా?: కాళేశ్వరం కమిషన్
  • ఫైన్సాన్స్ ఖాశాఖకు అన్ని వివరాలు తెలియవు. ఏం జరిగినా ఇరిగేషన్ శాఖకే తెలిసి ఉంటుంది. ఆ శాఖ ఆధ్వర్యంలోనే అన్నీ జరిగాయి: ఈటల

 

No comments:

Post a Comment