రాష్ట్రంలో ఇప్పుడు రెండు పార్టీల్లోకి వలసలు మొదలయ్యాయి. దీనిపై ఎవరి
విశ్లేషణలు వారివే. ఈ రెండు పార్టీల బలాబలాలను ఆ మధ్య రాష్ట్రంలో జరిగిన ఉప
ఎన్నికల ఫలితాలను బట్టి చర్చలను బట్టి సీమాంధ్రలో వైఎస్‌ఆర్‌సీపీ,
తెలంగాణలో టీఆర్‌ఎస్ ముందజలో ఉన్నాయని వివిధ సర్వేలు కూడా తేల్చాయి. అది
అప్పటి మాట. టీఆర్‌ఎస్ అధినేత ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్ఠాన పెద్దలతో
చర్చలు, తెలంగాణపై కాంగ్రెస్ నేతలు భిన్నస్వరాల తర్వాత మళ్లీ రాజకీయ
సమీకరణాలు మారుతున్నాయి. దీనికి ఈ చర్చలే కారణమని కాదు, చంద్రబాబు, షర్మిల
పాదయాత్రలు ఒక కారణమైతే.. కేంద్రంలో మధ్యంతర ఎన్నికలు రావచ్చుననే సంకేతాలు
మరోకారణం. అయితే ఇప్పుడు జరుగుతున్న చర్చ కొంత ఆశ్చర్యాన్ని
కలిగిస్తున్నది. తెలంగాణలో వైఎస్‌ఆర్‌సీపీ బలం పుంజుకుంటున్నదని మీడియాలో
చర్చల మీద చర్చలు జరుగుతున్నాయి. అయితే తెలంగాణ ప్రజల మనోభావాలను తాము
గుర్తిస్తున్నామని, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే తమ పార్టీ జాతీయ పార్టీ
అవుతుందని ఆ పార్టీ నేతలు చెప్పుకొస్తున్నారు. మరి అలాంటిది ఇప్పుడు
తెలంగాణ పుంజుకుంటున్నది అంటే ఒక సీమాంధ్ర ప్రాంతానికి పరిమితమైన పార్టీ
జాతీయ పార్టీ ఎలా అవుతుందో అర్థం కాదు. మరో విషయం ఏమంటే తెలంగాణ ప్రాంతంలో ఆ
పార్టీ చేరుతున్నవారిలో మెజారిటీ వర్గం జగన్ సామాజిక వర్గానికే చెందిన
వారు కావడం గమనార్హం. అలాగే అందులో చాలామంది వైఎస్ బతికి ఉన్నప్పుడు ఆయన
అనుంగులుగా ఉన్నవారు కొందరతై మరికొంత మంది ఆయనటో అంటకాగిన వారే. కనుక
ఇప్పుడు వాళ్లు వైఎస్‌ఆర్‌సీపీలో చేరితే టీఆర్‌ఎస్‌కు ఏదో ఇబ్బంది
వస్తుందనే వార్తల్లో వాస్తవం లేదు.
అట్లాగే తెలంగాణ ప్రాంతంలో ఇప్పుడు వైఎస్‌ఆర్‌సీపీలో చేరుతున్నవారిని చూపిస్తూ టీఆర్‌ఎస్‌లో కలవరం మొదలైందని అంటున్నారు. ఇంకా సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఎన్నడూ సత్తా చూపలేదంటున్నారు. ఆ పార్టీ బలం ఉప ఎన్నికలకే పరిమితమంటున్నారు. కానీ ఆ పరిస్థితి 2009 డిసెంబర్ 9 తర్వాత మారిందనే చెప్పాలి. ఎందుకంటే అప్పటి వరకు ఎవరు తెలంగాణ అన్నా నెత్తిన పెట్టుకున్నారు. అంతెందుకు 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆశలు వదులుకున్న చోట టీఆర్‌ఎస్ తన జెండా ఎగురవేసింది. వైఎస్ పెట్టిన ప్రలోభాలకు లొంగి పార్టీని వదిలినవారు వారు ఇప్పుడు ఉద్యమంపై విషం చిమ్ముతున్నారు. ఇప్పుడు మాత్రం తెలంగాణవాదులెవరో వలసవాదులకు అంటకాగుతున్నదెవరో ఒక స్పష్టమైన అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు. అలాగే ఇప్పుడు టీఆర్‌ఎస్‌లో చేరుతున్న నాయకులు దశాబ్దాలకు పైగా రాజకీయ అనుభవం ఉన్నవారు కొంతమంది అయితే మరికొందరు మూడేళ్లుగా ఉద్యమంలో భాగస్వామ్యమవుతున్నవారే. కాబట్టి ఏదో మాట వరుసకు మేము తెలంగాణ బిడ్డలమే అంటే అర్థం చేసుకులేనంత అమాయకులు కాదు ఈ ప్రాంత ప్రజలు. కాకపోతే టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా ఏ వేదిక ఏర్పడినా, ఏ పార్టీ పుట్టుకొచ్చినా దాన్ని ఆకాశానికి ఎత్తడం కొన్ని మీడియా సంస్థలకు అలవాటైంది. దీనికి కారణం ఒక పార్టీ, ఒక వ్యక్తిపై ఉన్న వ్యతిరేకతను బహిరంగంగా చూపెట్టలేక పరోక్షంగా అలాంటి వేదికలు అవకాశం కల్పించడం. అందుకే ఇప్పటి వరకు తెలంగాణ ఎన్ని పార్టీలు వచ్చినా టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం కాలేకపోయాయి. కారణం సుదీర్ఘ ప్రక్రియతో కూడుకున్న ఈ లక్ష్య సాధన కోసం ఎదురుచూసే ఓపిక వాళ్లకు లేకపోవడమే. అవకాశవాదం కోసం అన్ని వదులుకొని ఇప్పుడు అధికార పదవులు అనుభవిస్తున్న వారిని మనం చూస్తూనే ఉన్నాము.
అయితే కొత్త పార్టీ వచ్చినప్పుడు అందులోకి వెళ్లడం కొత్త కాదు. ప్రజాప్రతినిధులు ప్రజల గురించి ఆలోచించే స్థితిలో లేకున్నా తమ పదవుల కోసం మాత్రం అనుక్షణం తపిస్తూనే ఉంటారు. తీరా ఎన్నికల సమమంలో జంప్ జిలానీ అయితే రెంటికి చెడ్డ రేవడి అవుతామేమోనన్న మీమాంస వారిని వెంటాడుతుంది. అందుకే తమ బెర్తులను ఖాయం చేసుకోవడానికి ప్రజాప్రతిధులు ఇలాంటి ప్రయోగాలు ఎప్పుడూ చేస్తూనే ఉంటారు. ఇక వైఎస్‌ఆర్‌సీపీ బలమెంతోఇప్పుడే చెప్పలేము కానీ కడప పార్లమెంటు, పులివెందుల, కోవూరు అసెంబ్లీ ఎన్నికల్లో చూపిన ఊపు ఆ తర్వాత ఉప ఎన్నికల్లో కనిపించలేదు. ఎందుకంటే జగన్ కోసం రాజీనామా చేసిన రెండుస్థానాల్లో ఆ పార్టీ చతికిలపడింది. దీన్ని ఆ పార్టీ వాళ్లు అవి మా సీట్లు కావు కదా అని సమర్థించుకున్నా దాని ప్రభావం ఆ పార్టీపై ఉన్నది. అలాగే తెలంగాణ ప్రాంతంలో పరిస్థితులు వేరుగా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడే ఈ ప్రాంతంలో ఎవరిది పై చేయి అవుతుందో సర్వేలకు అందని సస్పెన్స్ అది. కానీ సీమాంధ్ర ప్రాంతంలో కుల ప్రాతిపదిక రాజకీయాలు జరుగుతాయన్నది జగమెరిగిన సత్యం. కనుక గంపగుత్తగా వైఎస్‌ఆర్‌సీపీకే అత్యధిక సీట్లు వస్తాయని చెప్పలేము. ఎందుకంటే అక్కడ త్రిముఖ పోటీ ఉంటుంది. వాటిలో టీడీపీ, కాంగ్రెస్‌లకు ఎంతోకొంత ఓటు బ్యాంకు ఉంటుంది. అలాగే ఇరు పార్టీల్లోనూ ఎంతో కొంత వ్యక్తిగత బలమున్న నేతలే ఎక్కువగా ఉన్నారు. ఈ త్రిముఖ పోటీలో ఆ సైకిల్, చేతి వాటాన్ని తట్టుకొని ఫ్యాన్ గాలి వీస్తుందని అక్టోపస్‌లా భవిష్యత్తు చెప్పడానికి ఆంధ్ర రాజకీయాలు అంతుచిక్కవు. కనుక అక్కడ ఎవరికి ఎవరు తక్కువేమీ కాదు. కాకపోతే ఏ పార్టీ మెజారిటీ సీట్లు దక్కించుకుంటుందనే దానిపైనే అంతా ఆసక్తి. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అసలు రాజకీయం ఆంధ్రలోనే ఉండబోతున్నది. తెలంగాణపై తేల్చేదాకా ఇక్కడ ఉద్యమపార్టీదే ఉన్నతస్థానం.
-రాజు

No comments:
Post a Comment