‘చలో అసెంబ్లీ’ సందర్భంగా కిరణ్ సర్కార్ శాంతిభవూదతల పరిరక్షణ పేరుతో తనను
తానే ధించుకున్నది. చలో అసెంబ్లీని అడ్డుకోవడానికి వేలాదిమంది పోలీసులను
మోహరించినా ప్రయోజనం లేకుండా పోయింది. ఉద్యమకారుల కంటే పోలీసుల అత్యుత్సాహం
వల్లే ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. ప్రభుత్వం ఎంత నిర్బంధకాండను
అమలుచేసినా తెలంగాణవూపజలు తమ ఆకాంక్షను చాటారు. ప్రభుత్వమే పోలీసు ఫోర్సుతో
‘చలో అసెంబ్లీ’ని సక్సెస్ చేసింది.అయితే ‘చలో అసెంబ్లీ’ పై సీమాంధ్ర
మీడియా అర్ధసతాలతో, వక్రీకరణలతో కథనాలను ప్రసారం చేసింది. వీటిలో
రాష్ట్రవూపభుత్వం‘అసెంబ్లీ ముట్టడిని కట్టడి చేసింద’ని, కిరణ్ ను కాంగ్రెస్
పెద్దలు మెచ్చుకున్నారని చెప్పుకొచ్చారు.
అలాగే ప్రతి శుక్రవారం
జరిగే కాంగ్రెస్ కోర్ కమిటీలో చలో అసెంబ్లీ, తెలంగాణలో తాజా పరిస్థితులపై
సీరియస్‌గా చర్చ జరిగిందని ఇదే మీడియా చెప్పుకొచ్చింది. తెలంగాణపై హస్తిన
పెద్దలు అసెంబ్లీ సమావేశాల తర్వాత అఖిలపక్షం ఏర్పా టు చేయనున్నారని,
ఇప్పటికే సిద్ధం చేసిన రెండు ప్రతిపాదనలను తెలంగాణ ప్రజావూపతినిధుల ముందు
ఉంచి,వారిని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నదని ఊహా కథనాలు ప్రసారం
చేస్తున్నాయి.
అందులో మొదటిది భారీ ప్యాకేజీ అని, రెండవది
కర్నూల్, అనంతపురంతో కలిపి రాయల తెలంగాణ ప్రతిపాదనను వారి ముందు
ఉంచనున్నట్లు చెబుతున్నది. వారానికి ఒకసారి జరిగే కోర్‌కమిటీలో సహజంగానే
కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల గురించి, ఇతర అంశాల గురించి చర్చ జరగడం సహజమే.
ముఖ్యంగా నిన్న జరిగిన సమావేశంలో ప్రధానంగా ఆహారభద్రత బిల్లుపై చర్చ,
ఎన్డీఏలో జేడీయూ ముసలం తదితర అంశాల గురించి చర్చ జరిగి ఉంటుంది. యూపీఏ
ప్రభుత్వం నుంచి మమతాబెనర్జీ, డీఎంకే లాంటి ప్రధాన భాగస్వామ్య పార్టీలు
వైదొలిగిన తర్వాత అరకొర మెజారిటీతో కేంద్ర ప్రభుత్వం మనుగడ సాగిస్తున్నది.
అలాగే యూపీఏ-2 ప్రభుత్వ హయాంలో రోజుకో కుంభకోణం వెలుగుచూస్తున్నది.
బీఎస్పీ, ఎస్పీ లాంటి పార్టీలు బయటి నుంచి ఇస్తున్న మద్దతుతో యూపీఏ
ప్రభుత్వం నిలబడింది. ఎస్పీ అధినేత కొంతకాలంగా నవంబర్‌లో లోక్‌సభకు
ముందస్తు ఎన్నికలు రావొచ్చు అనే సంకేతాలు ఇస్తున్నారు. దీనికనుగుణంగా
కేంద్రంలో కొత్త సమీకరణలు జరుగుతున్నాయి.
కేంద్ర ప్రభు త్వం
బీహార్‌కు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది. మోడీని బూచిగా చూపించి బయటకు
రావాలనుకుంటున్న జేడీయూను ప్రసన్నం చేసుకోవడానికి కాంగ్రెస్ తనవంతు
ప్రయత్నాలు చేస్తున్నది. అందులో భాగంగానే కాంగ్రెస్, బీజేపీయేతర
ముఖ్యమంవూతులు ‘ఫెడరల్ ఫ్రంట్’ పేరుతో కొత్త ఫ్రంట్‌కు సన్నాహకాలు
మొదలుపెట్టారు. దీనికి సంబంధించి ఒకరినొకరు సంప్రదించుకుంటున్నారు. ఈ
పరిస్థితుల్లో యూపీఏ-3ని అధికారంలోకి తీసుకొచ్చి రాహుల్‌ను ప్రధానిగా
చేయాలనే సోనియాగాంధీ ఆశయం అంత సులువు కాదనేది రాజకీయ విశ్లేషకుల అభివూపాయం.
పైగా యూపీఏ-1, యూపీఏ-2 ప్రభుత్వాల ఏర్పాటులో ఆంధ్రవూపదేశ్ కీలక పాత్ర
పోషించింది. ఇప్పుడాపరిస్థితి లేదు. ఈ మధ్య కాలంలో వచ్చిన అన్ని ‘సర్వే’,
అధ్యయనాలు యూపీఏకు పరాభవం తప్పదని చెబుతున్నాయి. అట్లాగని ఎన్డీఏ
అధికారంలోకి వస్తుందని ఆ సర్వేలు చెప్పడం లేదు. కానీ వచ్చే ఎన్నికల్లో
ప్రాంతీయ పార్టీల హవా మాత్రం కొనసాగుతుందని స్పష్టంగా చెబుతున్నాయి. ఈ
నేపథ్యంలో కొత్త పొత్తుల కోసం ఇటు యూపీఏ, అటు ఎన్డీఏ ఆరాటపడుతున్నాయి.
కాంగ్రెసేతర ప్రాంతాల్లో ఆయా పార్టీలతో పొత్తు తప్పని సరి. కానీ
ఆంధ్రవూపదేశ్‌లో వరుసగా రెండుసార్లు అధికారంలోకి వచ్చి, కేంద్ర ప్రభుత్వ
ఏర్పాటులో రెండుసార్లు నిర్ణయాత్మక పాత్ర పోషించిన ఈ రాష్ట్రంలో
కాంగ్రెస్‌కు తెలంగాణ రూపంలో కష్టాలు మొదలయ్యాయి. ఈ అంశాన్ని తేల్చకుండా
ఎన్నికలకు వెళ్లే పరిస్థితి లేదు. తెలంగాణపై 2009 డిసెంబర్ 9 ప్రకటన తర్వాత
పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్రానికి
ప్రత్యామ్నాయంగా ఏ ప్రతిపాదనకు అంగీకరించరు. ఈ విషయం కాంగ్రెస్ అధిష్ఠాన
పెద్దలకు కూడా తెలుసు. ఇప్పుడు సీమాంధ్ర మీడియా ప్రచారం చేస్తున్న
ప్రతిపాదనలు శ్రీకృష్ణ కమిటీ సూచించిన ఆరు ప్రతిపాదనల్లోని అంశాలే. వీటిలో ఏ
ఒక్కదాన్ని ఒక ప్రాంతం వారు ఆమోదిస్తే మరో ప్రాంతం వారు అంగీకరించరు అనే
విషయాన్ని ఆ కమిటీనే కుండబద్దలు కొట్టింది. శ్రీకృష్ణ కమిటీ ఎటూ
తేల్చలేకపోయిందని, ఆ నివేదిక ముగిసిన అధ్యాయమని కాంగ్రెస్ పెద్దలు
పేర్కొన్నారు. అయినా సీమాంధ్ర మీడియా ఎందుకు పనిగట్టుకొని ఈ ప్రచారం
చేస్తున్నది.
ఆ మధ్య ఇదే మీడియా గూర్ఖాలాండ్ తరహాలో తెలంగాణకు
ప్రత్యేక మండలిని ఏర్పాటు చేస్తారని ప్రచారం చేసింది. అయితే ఆ బిల్లు ఆమోదం
పొందాలంటే పార్లమెంటులో 2/3 మెజారిటీ కావాలి. అందుకు ప్రధాన ప్రతిపక్షం
బీజేపీ అంగీకరించదు. ఈ ప్రతిపాదన సాధ్యం కాదు. అలాగే ప్యాకేజీకి కూడా
తెలంగాణవాదులు ఒప్పుకోరు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ విషయంలో పూటకో
మాట మాట్లాడుతూ కాలం వెళ్లదీస్తున్నది. ఇక మిగిలింది హైదరాబాద్‌తో కూడిన
తెలంగాణ రాష్ట్ర పునరుద్ధరణ మాత్రమే. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వలేము
అని చెప్పి ప్యాకేజీని ముందుకు తెస్తున్నదా? తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్
పార్టీ భూస్థాపితం అయినా ఫరవాలేదు అనుకున్నపుడే ఈ ప్రతిపాదన వస్తుంది.
కాంగ్రెస్ పార్టీ ఆ సాహసం చేస్తుందా లేదా అన్నది కాలం తేలుస్తుంది.
తెలంగాణపై తేలుస్తామని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే అనేక గడువులు పెట్టింది. ఆ
తర్వాత మాట మార్చింది. కనుక ఇప్పుడు సీమాంధ్ర మీడియా చెబుతున్న కట్టుకథలు
నమ్మే స్థితిలో తెలంగాణ ప్రజానీకం లేదు. తరతరాల పోరాటాల, త్యాగాల చరిత్ర
పునాది మీద ఆత్మగౌరవ ఉద్యమాన్ని నిర్మించుకున్న తెలంగాణ సమాజం తెలంగాణ
సాధించే దాకా విక్షిశమించదు. తెలంగాణ రాష్ట్రం మినహా మరే ప్రత్యామ్నాయాన్ని
అంగీకరించదు.
-రాజు ఆసరి