తెలంగాణపై తేల్చాల్సింది కేంద్ర ప్రభుత్వమే అని పైకి తెలంగాణకు వ్యతిరేకం
కాదంటూనే, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును పరోక్షంగా వ్యతిరేకిస్తున్న
పార్టీలు టీడీపీ, వైఎస్‌ఆర్‌సీపీలు.,ఇక 2001లోనే తెలంగాణ రాష్ట్రాన్ని
ఏర్పాటు చేయాలని కోరుతూ వైఎస్ నాడు 41 మంది ఎమ్మెల్యేల సంతకాలతో కాంగ్రెస్
అధిష్ఠానం దగ్గరికి పంపారు. దశాబ్ద కాలంగా తెలంగాణ సమస్య కాంగ్రెస్
కోర్టులో ఉన్నది. ఇప్పుడు తెలంగాణపై భిన్న అభిప్రాయాలు ఉన్నది కాంగ్రెస్
పార్టీలోనే. ఆ పార్టీ అధిష్ఠాన పెద్దలు చెబుతున్నట్టు సంప్రదింపులు, చర్చలు
అనేకసార్లు జరిగాయి. తెలంగాణపై నిర్ణయం తీసుకోవాల్సిన అధికార పార్టీలోనే
ఏకాభిప్రాయాన్ని సాధించలేని వారు తెలంగాణ ఇచ్చే శక్తి కాంగ్రెస్ పార్టీకే
ఉన్నదనడం ఇప్పటి విషాదం. షిండే పెట్టిన ‘నెల’ గడువును తప్పుపట్టిన ఆజాద్
ఇప్పుడు మరో గడువు పెట్టినా, షకీల్ అహ్మద్ తెలంగాణకు కాంగ్రెస్ వ్యతిరేకం
కాదని చెప్పినా అది వాళ్ల పార్టీ నేతలను కాపాడుకోవడానికే తప్పా ప్రజల
ఆకాంక్షను నెరవేర్చేందుకు మాత్రం కాదు. మీడియాలో వస్తున్నట్టు అసెంబ్లీలో
తెలంగాణపై తీర్మానం పెట్టి చేతులు దులుపుకుంటే సరిపోదు. పార్లమెంటులో
తెలంగాణపై బిల్లు పెట్టి ఆ ప్రక్రియ ప్రారంభించినప్పుడే దానికి విలువ
ఉంటుంది. తెలంగాణఫై కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న సాచివేత ధోరణిని
నిరసిస్తూ పార్టీని వీడుతున్న నేతలను చూసి హస్తిన పెద్దలే కాదు
ఆంధ్రప్రదేశ్‌లోని సీమాంధ్ర మీడియా కూడా వలసలను కట్టడి చేసేందుకు పూటకో
కథనాన్ని ప్రసారం చేస్తున్నది. అందులో భాగంగానే తెలంగాణలోపై హస్తినలో ఏదో
జరుగుతున్నదనే హడావుడి.
Wednesday, 5 June 2013
Subscribe to:
Post Comments (Atom)
Featured post
అయోధ్య నుంచి పోటీ చేయండి
యోగి ఆదిత్యనాథ్‌కు అఖిలేశ్ యాదవ్ సవాల్ త్వరలో రామ మందిరానికి ఎస్పీ నేతలతో కలిసి వెళ్తా: ఎస్పీ అధినేత న్యూఢిల్లీ, అక్టోబర్ 8: ఉత్తరప్రదే...
-
దేశవ్యాప్త నిరసనలకు పిలుపు వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మాదురోను అమెరికా దళాలు బంధించడాన్ని భారతదేశంలోని వామపక్ష పార్టీలు (CPI, CPI(M), ఫార...
-
అలీ ఖమేనీ మృతితో రగిలిపోతున్న ఇరాన్ ఇజ్రాయెల్‌కు లరిజానీ భయంకర హెచ్చరిక! టెహ్రాన్: ఇరాన్ సుప్రీం లీడర్ అయాతొల్లా అలీ ఖమేనీ మరణంతో పశ్చిమ...
-
శ్రీవాణిని కేతన్ హైస్కూల్ లో పదవ తరగతి సమయంలో పొద్దున మాకు ట్యూషన్స్ ఉండేవి. ప్రభాకర్ రెడ్డి సార్ (మాథ్య్స్) , సీతారామరావు సార్ (సోష...
No comments:
Post a Comment