దేశంలో
రెండు దశాబ్దాలుగా సంకీర్ణ ప్రభుత్వాలే నడుస్తున్నాయి. ఎన్డీఏ ప్రభుత్వం
ఏర్పడింది కూడా ప్రాంతీయ పార్టీల మద్దతుతోనే. ప్రస్తుత యూపీఏ ప్రభుత్వానికి
ఆక్సిజన్‌ను అందిస్తున్నది ప్రాంతీయ పార్టీలే. అంటే ఒకరకంగా జాతీయ
పార్టీలుగా చెప్పుకునే కాంగ్రెస్, బీజేపీలు పెద్ద సైజు ప్రాంతీయ పార్టీలే.
కానీ నాగం జనార్దన్‌రెడ్డికి మాత్రం ఇప్పుడు బీజేపీ జాతీయ పార్టీగా
కనిపిస్తున్నది. ఇదే జాతీయ పార్టీ దేశంలో మూడు కొత్త రాష్ట్రాలను ఏర్పాటు
చేసినప్పటికీ ఒక ప్రాంతీయ పార్టీ బెదిరింపులకు లొంగి తెలంగాణ రాష్ట్రాన్ని
ఏర్పాటు చేయలేదు. అంతెందుకు 2004లో రాష్ట్రంలో ఒక ప్రాంతీయ పార్టీని
ఓడించడానికి జాతీయ పార్టీగా చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ టీఆర్‌ఎస్‌తో
పొత్తుపెట్టుకున్నది. ఆ ఎన్నికల్లో టీడీపీని తెలంగాణలో మట్టికరిపించింది ఉప
ప్రాంతీయ పార్టీనే. అదే టీడీపీ 2009 ఎన్నికల్లో నాగం చెబుతున్న ఉప
ప్రాంతీయ పార్టీతో పొత్తుపెట్టుకున్న విషయం నాగం మరిచిపోయారేమో! తెలంగాణ
కోసం ఎవరు ఏ పార్టీలో అయినా పనిచేయవచ్చు. కానీ ప్రాంతీయ, ఉప ప్రాంతీయ
పార్టీలతో తెలంగాణ రాదు అనడమే వారి అవగాహన లోపానికి నిదర్శనం.
Wednesday, 5 June 2013
Subscribe to:
Post Comments (Atom)
Featured post
-
పుట్టిన పెరిగిన ప్రాంతమంతమంటే ఎవరికైనా మమకారం ఉంటుంది. అందుకే మా కాలేరు (గోదావరి ఖని) అట్లనే ఉంటది. 80వ దశకంలో కోల్ బెల్ట్ ఏరియాలో ఉపాధి ...
-
నమస్తే తెలంగాణ ఆవిర్భావం రవీంద్రభారతిలో జరిగింది. 6-6-2011న ఆ పత్రిక ప్రారంభోత్సవానికి కేసీఆర్, తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశం...
No comments:
Post a Comment