ఒక్క ఓటు రెండు రాష్ట్రాలని కాకినాడలో తీర్మానం చేసి దశాబ్ద కాలం
పూర్తయింది. అప్పుడు ఓట్లు పడ్డాయి. రెండు రాష్ట్రాలు మాత్రం ఏర్పడలేదు.
మూడు కొత్త రాష్టాలు ఏర్పాటు చేసిన ఆ పార్టీకి తెలంగాణ ఇచ్చే అవకాశం ఉన్నా ఆ
పని చేయలేదు. ఇప్పుడు బీజేపీ అధికారంలోకి వస్తే మూడు నెలల్లో తెలంగాణ
అంటున్నది. జాతీయ పార్టీగా చెప్పుకునే బీజేపీ రెండు రాష్ట్రాలు ఏర్పాటు
చేయాలని రెండు ప్రాంతాల్లో ఉద్యమాలు చేయవచ్చు. కానీ ఆంధ్రలో అడుగుపెట్టదు.
అక్కడి ప్రజాస్వామిక వాదులతో కలిసి ఉద్యమం చేయదు. ఇక్కడ మాత్రం ఉప ప్రాంతీయ
పార్టీతో తెలంగాణ సాధ్యం కాదంటున్నది. అధికారంలో ఉన్నప్పుడు హాండ్ ఇచ్చి,
ప్రతిపక్షంలో ఉండి హామీలు గుప్పిస్తున్నది. తెలంగాణపై టీఆర్‌ఎస్‌కు ఉన్న
కమిట్‌మెంట్ మిగతా ఏ పార్టీలకు ఉండదు. ఎందుకంటే ఆయా పార్టీలన్నీ ఆంధ్రా
నాయకత్వంలో నడుస్తున్నవే. అందుకే ఆ పార్టీలకు తెలంగాణ అంశం అంత
ప్రాధాన్యమైనది కాదు. ఇదే సీమాంధ్ర మీడియాకు కావలసింది. టీఆర్‌ఎస్‌ను
దెబ్బకొడితే ఆంధ్రా పార్టీలేవీ తెలంగాణ అంశం తెరమరుగవుతుందని వారి భావన.
అందుకే టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వాటిని హైలెట్ చేయడం,
అనుకూలంగా మాట్లాడితే హైడ్ చేయడం నాలుగేళ్లుగా చూస్తున్నదే.
Wednesday, 5 June 2013
Subscribe to:
Post Comments (Atom)
Featured post
-
అనుకోకుండా వచ్చిన జర్నలిజం వృత్తిలో చాలా విషయాలు నేర్చుకున్నాను. రాయడంలో మెళకువలు చెప్పిన పెద్దలు చాలామంది ఉన్నారు. కొవిడ్ సమయంలో ఉద్యోగాన్...
-
పుట్టిన పెరిగిన ప్రాంతమంతమంటే ఎవరికైనా మమకారం ఉంటుంది. అందుకే మా కాలేరు (గోదావరి ఖని) అట్లనే ఉంటది. 80వ దశకంలో కోల్ బెల్ట్ ఏరియాలో ఉపాధి ...
-
నమస్తే తెలంగాణ ఆవిర్భావం రవీంద్రభారతిలో జరిగింది. 6-6-2011న ఆ పత్రిక ప్రారంభోత్సవానికి కేసీఆర్, తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశం...
No comments:
Post a Comment