ప్రపంచంలో తెలుగువారు ఎక్కడ ఉన్నా వారి సంక్షేమమే తెలుగుదేశం పార్టీ ధ్యేయం
అని చంద్రబాబు తరచూ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తుంటాడు. ఉత్తరాఖండ్ వరద
బాధితులను రక్షించడానికి, వారిని వారి స్వస్థలాలను పంపించడానికి టీడీపీ
అధినేత నాలుగైదు రోజులుగా నానా హడావుడి చేస్తూనే ఉన్నాడు. వరద బాధితులకు
సౌకర్యాలు సరిగా లేవని ఏపీ భవన్ ముందు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసి
ధర్నా కూడా చేశారు. అట్లాగే వరద బాధితులను రక్షించడంలో భారత సైన్యం
చేస్తున్న కృషిని అభినందిస్తున్నారు. ఇఎ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కనుక
ఎన్నికల్లో లబ్ధి పొందడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై
విరుచకుపడుతున్నారు. అయితే ఇప్పుడు చంద్రబాబు ఈ బురద రాజకీయం ఎందుకు
చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఒకవైపు సైన్యాన్ని
ప్రశంసిస్తూనే, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను విమర్శిస్తున్నారు అంటే
ఏమనుకోవాలి? భారత సైన్యం ఎవరి ఆదేశాల మేరకు పనిచేస్తుందో తొమ్మిదేళ్లు
ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబుకు తెలియకపోవడం దురదృష్టకరం. మాట్లాడితే
తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక టీడీపీ అనే చంద్రబాబు వరద బాధితులను
ఆదుకునే పేరుతో టీడీపీ, కాంగ్రెస్ ఎంపీలు బాహిబాహీకి దిగి ఆంధ్రప్రదేశ్
పరువు తీశారు. క్రమశిక్షణ గురించి లెక్చర్లు దంచే చంద్రబాబు ఆయన ముందే
కాంగ్రెస్, టీడీపీ ఎంపీలు ఒకరినొకరు తోసేసుకుంటూ, నోటికొచ్చినట్టు
తిట్టుకుంటుంటే ప్రేక్షక పాత్ర పోషించాడు. ఇక అధికార పార్టీ నేతల గురించి
ఎంత చెప్పుకుంటే అంత మంచిది. ఎందుకంటే పక్కవాడు లేస్తే గానీ మనకు చలనం రాదు
అన్నట్టు ఉంటుంది కాంగ్రెస్ నేతల వైఖరి. కష్టాల్లో ఉన్న వరద బాధితులను
ఆదుకుంటున్నామని రోజూ మీడియా ముందు ఫోజులు ఇచ్చుకుంటూ, క్రెడిబులిటీ కోసం
ఒకరినొకరు తిట్టుకుంటూ, కొట్టకునే దాకా వెళ్లారు. బాధితుల గోడు పక్కకు పోయి
నిన్న రాష్ట్ర, జాతీయ మీడియాలో వీరి గొడవే ప్రధానాంశం అయింది. సహాయ
చర్యలకు వర్షం అడ్డంకిగా మారుతున్నది. సైన్యం బాధితులను రక్షించడానికి ఎంతో
శ్రమిస్తున్నది. ఈ సమయంలో నేతలు పరామర్శల పేరుతో ఫైటింగులు చేసుకుంటే
రాష్ట్రం పరువు గంగపాలు చేశారు.
ఇదేనా తెలుగు వారి ఆత్మగౌరవం అంటే! కాంగ్రెస్, టిడిపి నేతలను చూసి జనం సిగ్గుతో తలదించుకునే పరిస్థితి వచ్చింది.
ఇదేనా తెలుగు వారి ఆత్మగౌరవం అంటే! కాంగ్రెస్, టిడిపి నేతలను చూసి జనం సిగ్గుతో తలదించుకునే పరిస్థితి వచ్చింది.
No comments:
Post a Comment