Posts

Showing posts from June, 2012
వాదనలు - వాస్తవాలు రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు అధికార పార్టీ అలసత్వాన్ని, ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైఫల్యాన్ని స్పష్టంగా చూపెట్టాయి. గడిచిన రెండున్నర సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో దాదాపు నలభై అసెంబ్లీ, రెండు పార్లమెంటు స్థానాల్లో ఉప ఎన్నికలు జరిగాయి. ప్రధాన ప్రతిపక్ష ఈ ఎన్నికల్లో ఏ ఒక్క సీటు కూడా గెలిచుకోలేదు. టిడిపి మొన్ననే ముప్ఫై ఏళ్ల సంబురాలను చేసుకున్నది. బహుశా ఇన్నేళ్ళలో ఆ పార్టీ ఇన్ని  సంక్షోభాలను ఎదురుకోవడం మొదటిసారి. అందుకే ఈ ఉప ఎన్నికల్లో పది చోట్ల రెండో స్థానంలో నిలిస్తే, ఐదు చోట్ల డిపాజిట్లను కోల్పోయింది. దీనికి ఆ పార్టీ అధినేత చంద్రబాబు అవలంబిస్తున్న విధానాలే కారణం. ఈ ఉప ఎన్నికల ప్రచారంలో ఆ పార్టీ జగన్ ను లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేసిందే కానీ, యిప్పుడు జగన్ పై వస్తున్న అవినీతి ఆరోపణలకు మూలాలు కాంగ్రెస్ లోనే ఉన్నాయనే విషయాన్ని ప్రజలకు చెప్పడంలో విఫలం అయ్యింది. రాష్టంలో ప్రధాన సమస్య అయిన తెలంగాణపై రెండుకండ్ల సిద్ధాంతం వల్ల ఈ ప్రాంతంలో పూర్తిగా కనుమరుగయ్యే ప్రమాదంలో పడింది. పోనీ దీని వల్ల సీమాంధ్రలో అయిన తన పట్టును నిలుపుకున్నదా అంటే అదీ లేదు. రెంటికి చ
పరకాల చెప్పిన పాఠాలు టీఆర్‌ఎస్‌: స్వల్ప మెజారిటీతో పరకాలలో విజయం సాధించింది. ఇది తెలంగాణ ప్రజల ఉద్యమ చైతన్యానికి నిదర్శనం. పరకాల ప్రజల పరిణతికి అద్దం పడుతున్నది. పాలమూరు పరాజయం తర్వాత కొంత ఆలస్యంగానైనా మేల్కొన్నది. తెలంగాణ ఉద్యమ వారసత్వ నాయకత్వం పరకాల ప్రజలు టీఆర్‌ఎస్‌లో పెట్టారు. తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతం చేసేలా కార్యాచరణ రూపొందించాలి. అలాగే వైఎస్‌ఆర్‌సీపీ తెలంగాణ వ్యతిరేక పార్టీ అని ప్రచారం చేసినప్పటికీ ఆ పార్టీ అభ్యర్థి అన్ని ఓట్లు సాధించడం విశేషమే. పరకాలలో కొండా దంపతులకు గట్టి పట్టున్న నియోజకవర్గం. ఇరవై వేల మెజారిటీ వస్త్తుందన్న టీఆర్‌ఎస్‌ ఈ స్వల్ప మెజారిటీపై సమీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అలాగే తెలంగాణ కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్న నేతలు వివిధ పార్టీలలో ఉన్నారు. వారందని ఏకతాటిపైకి తెచ్చి వారిని కూడా ఉద్యమంలో భాగస్వామ్యంలో చేయాల్సిన బాధ్యత కూడా టీఆర్‌ఎస్‌, జేఏసీలపై ఉన్నది. తెలంగాణపై స్పష్టమైన వైఖరి చెప్పిన పార్టీలకు తెలంగాణలో స్థానం లేకుంటా చేయాలంటే ఐక్యంగా నడవాల్సిన సమయం ఇది.  వైఎస్‌ఆర్‌సీపీః పరకాలలో నియోజకవర్గంలో పదిహేను ఏళ్లుగా తమ ప్రాబల్యం నిలుపుకుంటూ వస్