వరుసగా మూడోసారి నరేంద్రమోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. 2014,2019లో సొంతంగా మెజారిటీ సాధించడంలో మంత్రివర్గ కూర్పులోనూ తన మార్క్‌ను చూపెట్టారు. అయితే పదేళ్ల తర్వాత బీజేపీ అధికారాన్ని దక్కించుకోవడానికి ప్రాంతీయపార్టీలే కీలకంగా మారాయి. ఈ నేపథ్యంలోనే 71 మంది మంత్రులతో మోడీ 3.0 సర్కార్ కొలువుదీరింది. ఇందులో 30 మంది క్యాబినెట్ హోదా, 5 స్వతంత్ర హోదా, 36 మంది సహాయమంత్రులు. ఈ కూర్పులోనూ ఒకవైపు సంకీర్ణ ధర్మం పాటిస్తూ ఐదు మిత్రపక్షాలకు హెచ్డీ కుమారస్వామి (జేడీఎస్), చిరాగ్ పాశ్వాన్ (ఎల్జేపీ-రాంవిలాస్ పాశ్వాన్), జితన్ రామ్ మాంఝీ (హెచ్ఏఎం-సెక్యులర్) రాజీవ్ రంజన్ సింగ్ (జేడీయూ), కింజారపు రామ్మోహన్నాయుడు (టీడీపీ) ఒక్కో కేబినెట్ పదవి కట్టబెట్టారు. పార్టీ విధేయులకే పెద్దపీట వేసినట్టు కనిపిస్తున్నది. తెలంగాణలో కిషన్‌రెడ్డి, సంజయ్లనే తిరిగి క్యాబినెట్లో తీసుకోవడం, ఏపీలోనూ మూడు దశాబ్దాలుగా పార్టీ సిద్ధాంతాల కోసం పనిచేస్తున్న భూపతిరాజు శ్రీనివాస వర్మకు చోటు దక్కడమే దీనికి నిదర్శనం. అలాగే ఈ ఏడాది, వచ్చే ఏడాది బీహార్, మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
Comments
Post a Comment