Posts

Showing posts from December, 2011

బాబు కోసం మన బాబులు ...

ఈ మధ్య తెలంగాణ అమరవీరుల స్తూపం దగ్గర బల ప్రదర్శనలు చేయడం రాజకీయ పార్టీల నేతలకు ఫ్యాషన్ అయిపోయింది. ఒక బలమైన ఆకాంక్ష కోసం బలిదానాలకు పాల్పడిన అమరులను వీరి రాజకీయాలు వాడుకోవడం సిగ్గుచేటు. ముఖ్యంగా తెలంగాణ టిడిపి నేతలు ఈ విషయంలో విచక్షణ కోల్పోయి ప్రవర్తిస్తున్నారు. ఇదంతా త్వరలో జరగబోయే ఉప ఎన్నికలకోసమే అన్న విషయం అందరికి తెలిసిందే. అయితే ఇక్కడే ఉన్నది పెద్ద విషాదం. రేపు జరగబోయే ఉప ఎన్నికల్లో పోటీకి నిలబడేది తెలంగాణ నేతలే. కానీ టిడిపి నేతల ఆరాటం మాత్రం సీమాంద్ర బాబును హీరో చెయ్యాలని, మంచిదే తమ నాయకుని కోసం కష్టపడడంలో తప్పులేదు. మోత్కుపల్లి చేస్తున్న ఆరోపణల్లో నిజానిజాలు సంగతి అటుంచితే, ఆయన తెలంగాణ గురించి, ఉద్యమం గురించి పూర్తిగా మరిచిపోయారు. కెసిఆర్ ఫాం హౌసులో రెస్ట్ తీసుకుంటున్నారని, తెలంగాణ ఉద్యమాన్ని ఢిల్లీ లో తాకట్టు పెట్టారని రోజు చెప్పిందే చెబుతున్నారు. అయితే యిప్పుడు తెలంగాణ టిడిపి తెలంగాణ కోసం ఏమిచేస్తున్నారు అన్నది ప్రశ్న! తెలంగాణ అంశం కేంద్రం పరిధిలో ఉంది, వాళ్ళే తేల్చాలి అని ముఖ్యమంత్రి మొదలు చంద్రబాబు, జగన్ ఇలా గోడమీది పిల్లులందరూ అదే వాదిస్తున్నారు. మరి ఈ సమస్య ఎ

telangana

Image

telangana

Image

telangana

Image

వ్యతిరేకం కాదంటే అనుకూలం కాదు....

నేను తెలంగాణకు వ్యతిరేకం కాదు. ఇదీ చంద్రబాబు తెలంగాణ జిల్లాల్లో పర్యటించేటప్పుడు మాత్రమే ఉపయోగించే పదం. మరి అయన చెప్పిన వ్యతిరేకం కాదు అనే మాటను మనం అనుకూలంగా అనుకుందామనుకుంటే పొరపాటే. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చెప్పే ఏకాభిప్రాయం పాటకు ఈయన చెప్పే మాట కోరస్ లాంటిది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏకాభిప్రాయం కోసం ఎన్నడూ ప్రయత్నించలేదు. ప్రయత్నించరు కూడా. అలాగే చంద్రబాబు కూడా వ్యతిరేకం కాదు అంటే మాట మార్చి అనుకూలం అని మాట్లాడడు. కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ పై అప్పుడప్పుడు పలికే చిలుక పలుకులు ఇక్కడి కాంగ్రెస్ నేతలకు సంతోషాన్ని కలిగిస్తాయి. ఇదీ వారికి వాళ్ళ  అధిస్టానం తెలంగాణపై సీరియస్ గా ఆలోచిస్తున్నట్టు కనిపిస్తుంది. ఇక చంద్రబాబు చెప్పే మాయ పలుకులు ఈ ప్రాంత టిడిపి నేతలను పులకింపచేస్తాయి. వాళ్లకు ఎక్కడలేని ఉత్సహాన్ని తెచ్చిపెడుతాయి. అదే ఊపులో ఒక రణభేరి, ఒక బస్సుయాత్ర పేరుతో తెలంగాణ కోసం పోరాడుతున్నామని చెప్పేందుకు పర్యటనలు చేస్తారు. మీ అధినేత వైఖరి ఏంటి అని నిలదేస్తే బౌతిక దాడులు చేయిస్తారు. తమ అధినేత మెప్పు కోసం ఉద్యమకారులను నోటికొచ్చినట్టు తిడుతారు. ఇలా తెలంగాణ  కాంగ్రెస్, టిడిపి

మా పేరు ఏకాభిప్రాయం....

తెలంగాణ పై తేల్చే టైం వచ్చింది ఆజాద్ అనడం కొత్తకాదు. మళ్లీ మళ్లీ మళ్లీ అయన అదే పాట పాడుతున్నారు. దీనికి కారణం బహుశా అవిశ్వాస తీర్మానం సందర్భంగా  తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అధిష్టానం పై చూపిన విధేయత కావొచ్చు. అందుకే వారు అదే మాట మాట్లాడుతున్నారు, మనవాళ్ళు వారి బాటనే పయనిస్తున్నారు. నల్లారి అడుగుల్లో నడుస్తున్న ఈ బానిస నేతలకు అధిస్టానం ఇచ్చిన నజరానా తెలంగాణ సమస్య సంక్లిష్టమైనది, సున్నితమైంది అనే పదాలు. ఈ పదాలకు కాంగ్రెస్ పెద్దల దగ్గర చాలా పర్యాయ పదాలున్నాయి. కాంగ్రెస్ దృష్టిలో తెలంగాణ అంటే ఏకాభిప్రాయం. అది సాధ్యం కానీ సమస్య. సాచివేత సమస్య, అంటే ఆజాద్ చెప్పిన మాటలకు స్పందించే ఓపిక తెలంగాణ ప్రజానీకానికి లేదు. కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ ఇస్తుందో లేదో తెలియకున్నా ఈ ప్రాంత నేతలు ఉద్యమం లో భాగస్వాములు కావాలని, పదవులను వదులుకొని పజల పక్షాన ఉండాలని ఉంటారని రెండేళ్లుగా ఎదురుచూస్తున్నారు. ఇక్కడ ప్రజల ఆకాంక్ష వేరు కాంగ్రెస్ నేతల ఆలోచన వేరు. అది ఏమిటో మొన్న అవిశ్వాస తీర్మానం సందర్బంగా చూపారు. నరనరాన కాంగ్రెస్ నైజాన్ని చూపారు. ముఖ్యమంత్రిని తిట్టిన వాళ్ళు, అది సీమాంద్ర సభ అన్నవాళ్
Image

చలి కాలంలో 'అవిశ్వాస' వేడి

అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో అవిశ్వాస తీర్మానం వేడి మొదలైంది. ఒకవైపు పార్టీలు విప్ జారీ చేశాయి. మరో వైపు తమ బలబలాలపై ఎమ్మెల్యేలతో సంప్రదింపులు మొదలయ్యాయి. అయితే ఈ అవిశ్వాస తీర్మానం ప్రభావం కేవలం కాంగ్రెస్ పార్టీ, జగన్ కు మధ్యే ఉన్నట్టు తాజా పరిణామాలను చూస్తే స్పష్టంగా కనిపిస్తున్నది. జగన్ వర్గం నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు అధికార పార్టీలోకి వెళ్లి పోవడంతో కిరణ్ సర్కారు అవిశ్వాస తీర్మానాన్ని ధీటుగా ఎదురుకుంటామని సవాళ్ళు కూడా విసిరింది. మొన్నటి దాక తన వైపు ఉన్న ఎమ్మెల్యేల్లో కొంత మంది బహిరంగంగానే ముఖ్యమంత్రిని కలిసి మద్దతు తెలిపారు. ఇదీ జగన్ వర్గాన్ని కలవరపెట్టింది. టిడిపి అవిశ్వాస తీర్మానం నోటీసు ఇవ్వడం తో ఇక జగన్ కూడా గుంటూరు ఓదార్పు యాత్రకు విరామం ఇచ్చి నేరుగా రంగం లోకి దిగారు. జగన్ నివాసం లో ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు జగన్ తో సమావేశం కావడం, కాంగ్రెస్ పార్టీలో పిఅర్పీ విలీనం తరువాత చిరంజీవి కూడా మొదటి సరి తమ ఎమ్మెల్యేలు అసంతృప్తి తో ఉన్నారనడంతో క్యాంప్ రాజకీయాలు మొదలయ్యాయి. జగన్ పడగొడితే నిలబెడతాను అన్న చిరునే తన అసంతృప్తిని వెల్లడించాడు. దీంతో రాష్ట్ర రాజకీయ సమీకరణాలు గం