నేను తెలంగాణకు వ్యతిరేకం కాదు. ఇదీ చంద్రబాబు తెలంగాణ జిల్లాల్లో పర్యటించేటప్పుడు మాత్రమే ఉపయోగించే పదం. మరి అయన చెప్పిన వ్యతిరేకం కాదు అనే మాటను మనం అనుకూలంగా అనుకుందామనుకుంటే పొరపాటే. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చెప్పే ఏకాభిప్రాయం పాటకు ఈయన చెప్పే మాట కోరస్ లాంటిది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏకాభిప్రాయం కోసం ఎన్నడూ ప్రయత్నించలేదు. ప్రయత్నించరు కూడా. అలాగే చంద్రబాబు కూడా వ్యతిరేకం కాదు అంటే మాట మార్చి అనుకూలం అని మాట్లాడడు. కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ పై అప్పుడప్పుడు పలికే చిలుక పలుకులు ఇక్కడి కాంగ్రెస్ నేతలకు సంతోషాన్ని కలిగిస్తాయి. ఇదీ వారికి వాళ్ళ అధిస్టానం తెలంగాణపై సీరియస్ గా ఆలోచిస్తున్నట్టు కనిపిస్తుంది. ఇక చంద్రబాబు చెప్పే మాయ పలుకులు ఈ ప్రాంత టిడిపి నేతలను పులకింపచేస్తాయి. వాళ్లకు ఎక్కడలేని ఉత్సహాన్ని తెచ్చిపెడుతాయి. అదే ఊపులో ఒక రణభేరి, ఒక బస్సుయాత్ర పేరుతో తెలంగాణ కోసం పోరాడుతున్నామని చెప్పేందుకు పర్యటనలు చేస్తారు. మీ అధినేత వైఖరి ఏంటి అని నిలదేస్తే బౌతిక దాడులు చేయిస్తారు. తమ అధినేత మెప్పు కోసం ఉద్యమకారులను నోటికొచ్చినట్టు తిడుతారు. ఇలా తెలంగాణ కాంగ్రెస్, టిడిపి నేతలు రెండు సంవత్సరాలుగా తెలంగాణ కోసం తెగ కష్టపడుతున్నారు. వాళ్ళ శ్రమను వాళ్ళ అధినేతలు గుర్తిస్తున్నారు. అయినా తెలంగాణ ప్రజలు తమను పట్టించుకోవడం లేదనే కోపం వారిని వెంటాడుతున్నది. ఆ కోపం ఎలా వ్యక్తమవుతున్నదంటే చంద్రబాబు తెలంగాణ పర్యటనలో అయన కాన్వాయి పై కోడిగుడ్లు. ఒక చోట చెప్పు రూపం లో కనిపిస్తున్నాయి. దీంతో ఖంగు తిన్న తెలంగాణ తెలుగు తమ్ముళ్ళు అక్కడ ఉద్యమకారులపై తమ ప్రతాపం చూపిస్తున్నారు. ఎక్కడైనా నాయకుని వెనుక కార్యకర్తలు నడుస్తారు. పాపం చంద్రబాబు ఇక్కడ కార్యకర్తలు, తన సొంతః సైన్యం సహాయంతో తెలంగాణలో పర్యటనలు చేస్తున్నారు. దీనికి అనూహ్య స్పందన వస్తున్నదని చంద్రబాబు కో మీడియా కోడై కూస్తున్నది. అది పతాక శీర్షికలో. నిరసన మాత్రం ఎక్కడో లోపలి పేజిలో ఉంటుంది. బాబు గారి పర్యటన బాగా జరగడానికి కిరణ్ బాబు సహకారం ఉండనే ఉన్నది. ఎందుకంటే యిప్పుడు వారిది తెలంగాణాను అడ్డుకోవడానికి ఏర్పడ్డ మాయా కూటమి .
Subscribe to:
Post Comments (Atom)
Featured post
ముఖ్యమంత్రి మార్పు ఖాయమేనా?
తెలంగాణ సీఎం ఇటీవల కాలంలో చేస్తున్న వ్యాఖ్యలు విడ్డూరంగా ఉంటున్నాయి. నిన్న వనపర్తి సభలో సీఎం మాట్లాడుతూ.. తెలంగాణకు ఏదో చేయాలనే ఆలోచనతో ప్ర...

-
ఏపీలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌కు ముందు కూటముల కూర్పు, అభ్యర్థుల తర్వాత అక్కడి ప్రజాభిప్రాయాన్ని అనేక సర్వే సంస్థలు తెలుసుకునే ప్రయత్నం చేశ...
-
వరుసగా మూడోసారి నరేంద్రమోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. 2014,2019లో సొంతంగా మెజారిటీ సాధించడంలో మంత్రివర్గ కూర్పులోనూ తన మార్క్‌ను చూపెట్...
-
రాష్ట్రంలో ఆరు నెలల కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా పాలన ఇప్పుడు చర్చనీయాంశమైంది. ప్రజలు మార్పు కోరుకున్న మార్పు అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం దృష...
No comments:
Post a Comment