తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డుకోవడానికి లగడపాటి రాజగోపాల్ అన్ని పాత్రలు వేశాడు. ఇప్పుడు అసిపోయి అఖిలపక్ష భేటీలో నేతలు సమైక్యవాదాన్ని వినిపించేలా ఒత్తిడి తేవాలని విద్యార్థులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. జిల్లాలకు వచ్చే నేతలను నిలదీయాలని వారికి సూచించాడు. ఇదే లగడపాటి రాజగోపాల్ అఖిలపక్షభేటీలో ఏమీ తేలదని ఇంతకు ముందే ప్రకటించాడు. మరి రెండురోజుల్లోనే ఆయనలో ఈ మార్పు ఎందుకు వచ్చిందో? అఖిలపక్ష భేటీ గురించి తెగ ఆందోళనపడుతున్నాడు. అంతేకాదు అఖిలపక్ష భేటీలో కాంగ్రెస్ పార్టీ రెండో ఎస్సార్సీ తమ పార్టీ విధానం అని చెబుతుందని కూడా చెప్పాడు. అఖిలపక్ష భేటీకి ముందే భవిష్యవాణిని వినిపిస్తున్న ఈ ఆంధ్ర ఆక్టోపస్ విజయవాడ వేదికగా విద్యార్థులను ఈ విన్నపాలు ఎందుకు కోరుతున్నాడు?అలాగే తెలంగాణలో అరవైశాతం మంది సమైక్యవాదాన్ని కోరుతున్నారని అబద్ధాలు చెబుతున్నాడు. తెలంగాణవాదుల్లో మూడేళ్ల కిందట ఉన్న భావోద్వేగాలు ఇప్పుడు లేవంటున్నాడు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన అన్ని విషయాలు అనర్గళంగా మీడియా ముందు చెబుతున్న లగడపాటికి అఖిలపక్షం గురించి అంతగా ఎందుకు కలవరపడుతున్నాడో ఇప్పటికైనా ప్రజలు గ్రహించాలి.ముఖ్యంగా సీమాంధ్ర ప్రజలు. ఎందుకంటే మూడేళ్ల కిందటే ప్రజలు మానసికంగా విడిపోయారు. ఇక మిగిలింది భౌగోళిక విభజనే.
Saturday, 8 December 2012
ఆందోళనలో ఆంధ్రా ఆక్టోపస్

Subscribe to:
Post Comments (Atom)
Featured post
-
పుట్టిన పెరిగిన ప్రాంతమంతమంటే ఎవరికైనా మమకారం ఉంటుంది. అందుకే మా కాలేరు (గోదావరి ఖని) అట్లనే ఉంటది. 80వ దశకంలో కోల్ బెల్ట్ ఏరియాలో ఉపాధి ...
-
నమస్తే తెలంగాణ ఆవిర్భావం రవీంద్రభారతిలో జరిగింది. 6-6-2011న ఆ పత్రిక ప్రారంభోత్సవానికి కేసీఆర్, తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశం...
No comments:
Post a Comment