తెలంగాణ సంస్కృతి విశిష్టమైనది. ఇక్కడి పండుగలకు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉన్నది. ఈ ప్రాంతాన్ని పాలించిన శాతవాహనులు మొదలు కాకతీయులు, కుతుబ్ షాహీలు, ఆసఫ్ జాహీ కాలంలో అనేక చారిత్రక నిర్మాణాలు జరిగాయి. వారంతా ప్రకృతి ప్రేమికులు. అందుకే వాళ్ళ నిర్మాణాలు అన్నీ సహజ వనరుల సంరక్షణతోనే ముడిపడి ఉన్నాయి. కాకతీయ పాలకుడు గణపతిదేవుడు బందీగా ఉన్నప్పుడు వారి సేనాని రేచెర్ల రుద్రుడు ఆ రాజ్యాన్ని కాపాడటమే కాదు, అద్భుతమైన నిర్మాణాలు చేపట్టారు. ఇవ్వాళ యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయంలో నాటి కాకతీయుల సాంస్కృతిక ప్రతీకలు ఆ దేవాలయాల నిర్మాణం లో మనకు కనిపిస్తాయి. ఈ దేవాలయ నిర్మాణాన్ని చూసిన అంతర్జాతీయ పురాతత్వ నిపుణులు కూడా అబ్బురపడే,ఆశ్చర్యపడే సాంకేతిక పరిజ్ఞానం రామప్ప దేవాలయం సొంతం. కాకతీయుల నాటి అద్భుత నాట్య కళ పేరణి నృత్య విశేషాలు రామప్ప దేవాలయ శిల్పాల్లో కనిపిస్తుంది. రుద్రుడు మనకే కాదు ప్రపంచానికి గొప్ప వారసత్వ సంపదను అందించాడు.
Subscribe to:
Post Comments (Atom)
Featured post
ముఖ్యమంత్రి మార్పు ఖాయమేనా?
తెలంగాణ సీఎం ఇటీవల కాలంలో చేస్తున్న వ్యాఖ్యలు విడ్డూరంగా ఉంటున్నాయి. నిన్న వనపర్తి సభలో సీఎం మాట్లాడుతూ.. తెలంగాణకు ఏదో చేయాలనే ఆలోచనతో ప్ర...

-
ఏపీలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌కు ముందు కూటముల కూర్పు, అభ్యర్థుల తర్వాత అక్కడి ప్రజాభిప్రాయాన్ని అనేక సర్వే సంస్థలు తెలుసుకునే ప్రయత్నం చేశ...
-
వరుసగా మూడోసారి నరేంద్రమోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. 2014,2019లో సొంతంగా మెజారిటీ సాధించడంలో మంత్రివర్గ కూర్పులోనూ తన మార్క్‌ను చూపెట్...
-
రాష్ట్రంలో ఆరు నెలల కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా పాలన ఇప్పుడు చర్చనీయాంశమైంది. ప్రజలు మార్పు కోరుకున్న మార్పు అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం దృష...
No comments:
Post a Comment