కొనుగోలు డిమాండుతో కేంద్రంతో కొట్లాట
ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఇందిరాపార్కు వద్ద చేపట్టిన మహాధర్నాలో పాల్గొన్న కేసీఆర్ మాట్లాడారు. ‘‘మా ప్రశ్న ఒక్కటే.. తెలంగాణ వడ్లు కొంటారా.. కొనరా?’’ అని సీఎం కేసీఆర్ కేంద్రాన్ని ప్రశ్నించారు. రైతులు కొత్త కోరికలు కోరడం లేదన్నారు. పండించిన పంట కొంటారా.. కొనరా? అనే అడుగుతున్నారన్నారు. కేంద్రం అడ్డగోలుగా మాట్లాడుతున్నదని అన్నారు రైతుల గోస తెలంగాణలోనే కాదు దేశవ్యాప్తంగా ఉందని ఆయన అన్నారు. ఇది ఆరంభం మాత్రమే అని అన్నారు. కేసీఆర్ చాలా కాలంగా కేంద్రం బీజేపీ, కాంగ్రెస్ ఏతర కూటమి ప్రయత్నాలు చేస్తున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ, యూపీఏ కూటముల్లో దేనికీ స్పష్టమైన మెజారిటీ రాదనే అంచనాల్లో టీఆర్ ఎస్ అధినేత ఉన్నారు. కాబట్టి కేంద్రంలో ఎవరు అధికారంలోకి రావలన్నా ప్రాంతీయ పార్టీలే కీలకం అనేది కేసీఆర్ వాదన. బెంగాల్ గెలిచిన తర్వాత తృణమూల్ అధినేత కూడా ఇతర రాష్ట్రాల్లో తన ప్రాబల్యాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నది. ఆప్ కూడా అదే బాటలో ఉన్నది. పంజాబ్, గోవా లలో ఎవరు అధికారంలోకి రావాలన్నా ఆప్ మద్దతు అవసరం అన్నది ఇటీవల వెల్లడైన ఎగ్జిట్ పో...