ఎమ్మెల్సీ అభ్యర్థుల కూర్పులో కేసీఆర్ మార్కు
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను టీఆర్ ఎస్ అధినేత ఖరారు చేశారు. మండలి మాజీ ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, బండ ప్రకాశ్, కౌశిక్‌రెడ్డి, సిద్దిపేట మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, తక్కెళ్లపల్లి రవీందర్‌రావులను అభ్యర్థులుగా ప్రకటించారు. ఈ ఆరుస్థానాల్లోనూ ఎన్నిక ఏకగ్రీవం కానున్నది.
అధికార పార్టీ కి ఉన్న సంఖ్యా బలానికి తోడు వారి మిత్రపక్షమైన ఎం ఐ ఎం సభ్యుల మద్దతుతో ఈజీగాఎమ్మెల్యే ల కోటాలో ఆరు స్థానాలు గెలిచే అవకాశం ఉన్నది. ఎమ్మెల్సీ పదవుల కోసం అధికార పార్టీలో ఆశావహుల జాబితా పెద్దగానే ఉన్నది. సోమవారం పొద్దుగాల నుండే గుత్తా సుఖేందర్‌రెడ్డి, కడియం శ్రీహరి, తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, కౌశిక్‌రెడ్డి, కోటిరెడ్డి, ఆకుల లలిత, ఎర్రోళ్ల శ్రీనివాస్, మధుసూదనాచారి, మరికొందరు ఆశావహుల పేర్లపై సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ ముఖ్యనేతలతో సుదీర్ఘ మంతనాలు జరిపారు. సిద్దిపేట మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఇవ్వాలని భావించారు. కానీ చివరికి ఎమ్మెల్యే కోటా కిందే ఆయనను ఎంపిక చేశారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న బండ ప్రకాశ్‌ను అనూహ్యంగా ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపిక చేశారు. ఈటల రాజేందర్ పార్టీ నుంచి బైటికి పోవడం, బీజేపీ నుంచి తిరిగి ఎమ్మెల్యేగా గెలవడం జరిగిపోయాయి. మొన్న ఉప ఎన్నికల్లో ముదిరాజ్ సామాజిక ఓట్లలో మెజారిటీ ఈటలకే పడ్డాయి. అందుకే భవిష్యత్తు ను దృష్టిలో పెట్టుకొని ఆ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం కల్పించాలనే ఉద్దేశంతో ఆయన్ను ఎంపిక చేసినట్లు తెలుస్తున్నది. అంతేకాదు కేబినెట్ విస్తరణలోనూ బండ ప్రకాశ్‌కు చోటు కల్పించే అవకాశం ఉన్నట్లు అధికారపార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. బండ ప్రకాశ్ స్థానంలో రాజ్యసభకు కల్వకుంట్ల కవితను పంపుతారు అంటున్నారు.
ఇక గవర్నర్ కోటా లోఎమ్మెల్సీకి కౌశిక్ రెడ్డి పేరును ప్రతిపాదించారు. అది పెండింగ్ లో ఉండటంతోతాజాగా ఆయన్ను ఎమ్మెల్యే కోటాలో ఎంపిక చేశారు. దీంతో గవర్నర్ కోటాకు మధుసూదనాచారి, దేశపతి శ్రీనివాస్, ఎర్రోళ్ల శ్రీనివాస్ ల పేర్లు ప్రచారం ఉన్నాయి. ఇంకా వీరితో పాటు చాలా మంది ఎమ్మెల్సీ సీటును ఆశిస్తున్నారు. కేసీఆర్ ఎవరి పేరు ఫైనల్ చేస్తారన్నది చూడాలి. తాజా ఎమ్మెల్సీ కూర్పులో కేసీఆర్ కంప్లీట్ మార్క్ కనిపిస్తున్నది.
Comments
Post a Comment