టీఆర్‌ఎస్ బీఆర్‌ఎస్‌గా మారిన తర్వాత కేసీఆర్ జాతీయ రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు. ఈసారి దేశంలో కాంగ్రెస్, బీజేపీ యేతర రైతు ప్రభుత్వం రావాలని చెబుతున్నారు. బీఆర్‌ఎస్ పేరుకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి వచ్చిన నాటి నుంచి ఆ పార్టీ కీలక నేతలు మొదలు కార్యకర్తలంతా కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని కోరుతున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, వందలాది కార్యకర్తల మధ్య బీఆర్‌ఎస్ పేరును కేసీఆర్ గత ఏడాది డిసెంబర్ 9న తెలంగాణ భవన్‌లో అధికారికంగా ప్రకటించారు. ఆరోజు కేటీఆర్ కూడా పాల్గొన్నారు. కానీ ఆ తర్వాత బీఆర్‌ఎస్ కార్యకలాపాలకు ఆయన దూరంగా ఉంటున్నారు. ట్విటర్‌లో మోడీ ప్రభుత్వంపై విమర్శలు చేయడం, రాష్ట్ర రాజకీయాలు, అభివృద్ధి కార్యక్రమాలు, రాష్ట్ర ప్రయోజనాల గురించి మాత్రమే ఎక్కువగా స్పందిస్తున్నారు.
ఢిల్లీ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభం, ఆ సందర్భంగా నిర్వహించిన యాగానికి కేటీఆర్ హాజరుకాకపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆ సమయంలో బీఆర్ఎస్ ముఖ్య నేతలంతా ఢిల్లీ వెళితే.. కేటీఆర్ మాత్రం ఇక్కడే ఉండిపోయారు. ముందుగా నిర్ణయించిన వేరే కార్యక్రమాలు ఉండటం వల్ల కేటీఆర్ హాజరుకాలేదని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఢిల్లీలో బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభించిన సందర్బంగా నిర్వహించిన యాగానికి కేటీఆర్ హాజరుకాలేదు. ఆ సమయంలో బీఆర్‌ఎస్ ముఖ్యనేతలంతా హస్తినలో ఉంటే కేటీఆర్ మాత్రం హైదరాబాద్‌లోనే ఉండిపోయారు. ముందుగా నిర్ణయించిన ఇతర కార్యక్రమాలు ఉండటంతోనే ఆయన హాజరుకాలేదని పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఖమ్మంలో జరుగుతున్న ఆవిర్బావ సభలో కూడా ఆయన లేరు. ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనడానికి ఆయన దావోస్ వెళ్లారు. అయితే ఇవన్నీ యాదృచ్ఛికంగా జరుగుతున్నాయా? లేక కేసీఆరే తన తనయుడిని రాష్ట్ర ప్రయోజనాలు, హక్కులు, రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడటానికి కేటీఆర్‌ను బీఆర్‌ఎస్ కార్యకలాపాలకు దూరంగా ఉంచుతున్నారా? అనేది ప్రస్తుత చర్చనీయాంశమైంది.
కేసీఆర్ బీఆర్‌ఎస్ కార్యకలాపాలను విస్తరిస్తూ.. వివిధ రాష్ట్రాల్లో బీఆర్‌ఎస్ రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షులను, ఏపీ బీఆర్‌ఎస్ రాష్ట్ర అధ్యక్షుడిని ప్రకటించారు. జాతీయ పార్టీలకు నీళ్లు, వ్యవసాయం, పంటల మద్దతు ధరలు వంటి విషయాల్లో జాతీయ విధానం ఉండాలంటున్నారు. దేశంలో నీటి లభ్యత, దేశంలో ఉన్న వనరులు, ఆర్థిక విధానాలు, రైతు సంక్షేమం వంటి గురించి ఉప ఎన్నికల సందర్భంలోనూ, మీడియా సమావేశాల్లోనూ మాట్లాడారు. తెలంగాణ నమూనా ఇప్పుడు దేశానికి కావాలని అంటున్నారు. కానీ తెలంగాణ ప్రయోజనాలు, రాష్ట్ర హక్కులు, కృష్ణ నదీలో వాటా గురించి ఈ మధ్య కాలంలో ప్రస్తావించడం లేదు. తాను జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు కాబట్టి దానికి అనుగుణంగానే దేశం గురించి మాట్లాడుతున్నారు. బీఆర్‌ఎస్ వేదికల ద్వారా కేసీఆర్ జాతీయ రాజకీయాల గురించి మాట్లాడితే.. రాష్ట్ర రాజకీయాల గురించి కేటీఆర్ మాట్లాడేలా ఒక పథకం ప్రకారం ఈ వ్యూహాత్మాకంగా దూరంగా ఉంచుతున్నారని అనుకుంటున్నారు.
No comments:
Post a Comment