Thursday, 10 April 2025

ప్రజలు మెచ్చేలా పాలన సాగించాలని పౌర సమాజం కోరిక


సీఎం రేవంత్‌ రెడ్డి వైఖరి నాకు దక్కనిది ఎవరికీ దక్కడానికి వీళ్లేదు అన్నట్టు ఉన్నది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజాస్వామ్యం, పౌర సమాజం, తెలంగాణ ప్రజల హక్కులు, నిరసనలు అంటూ డైలాగులు కొట్టిన సీఎం పవర్‌లోకి వచ్చిన పదిహేను నెలల్లోనే ప్రశ్నిస్తే తట్టుకోలేకపోతున్నారు. నెగ్గడమే కాదు, తగ్గడమూ విజయమే అన్నది కేసీఆర్‌ ఉద్యమకాలంలోనే కాదు, పదేళ్ల పాలనలో చూపెట్టారు. బీఆర్‌ఎస్‌ హయాంలో కేబీఆర్ పార్క్ చుట్టూ ఫ్లైఓవర్ల నిర్మించాలని ప్రతిపాదిస్తే టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రభుత్వ ప్రతిపాదనలకువ్యతిరేకంగా క్యాంపెన్ చేసింది.  వాకర్లు, ప్రజలు కూడా నిరసనలను పరిగణనలోకి తీసుకున్నది.  ఆ ప్రతిపాదనను విరమించుకున్నది. ఇది కదా ప్రజా ప్రభుత్వం అంటే!ప్రజల  ఇండ్లపైకి బుల్డోజర్లు పంపిస్తూ.. మూగ జీవాలైన పక్షులు, జంతువులను వాటి నివాస ప్రాంతాల నుంచి తరిమికొడుతూ.. ఇదేమని ప్రశ్నించిన వారిపై కేసులు పెడుతూ మాది  ప్రజా ప్రభుత్వం అంటే హాస్యాస్పదంగా ఉన్నది. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మంచిగా, వారు మెచ్చేలా పాలన సాగించాలని పౌర సమాజం కోరుతున్నది

ఇది కదా తెలంగాణ సోయి అంటే!

 


తెలంగాణ ఉద్యమంలో రేవంత్‌ రెడ్డి పాత్ర ఏమిటి అంటే ఎవరిని అడిగినా చెబుతారు. ఆయనకు ఎన్టీఆర్ గుర్తుకు వస్తారు. ఆయన గురువు చంద్రబాబు గుర్తుకు వస్తారు. కానీ పధ్నాలుగేళ్లు ఉద్యమం చేసిన ఉద్యమనాయకుడు, పదేళ్లు సీఎంగా పనిచేసి వ్యక్తి, గుర్తుకురారు. అంతేలే.  చంద్రబాబు సూత్రధారిగా, రేవంత్‌ రెడ్డి పాత్రధారిగా తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నాన్ని ఛేదించిన నాయకుడి పేరు తలుచుకోవాలన్నా, ఆయనతో పోల్చుకోవాలన్నా ఉద్యమకాలంలో తమరి ట్రాక్‌ రికార్డు కూడా సక్కగ లేదాయే. అందుకే ప్రపంచంలో అన్ని విషయాల గురించి మాట్లాడుతారు కానీ తెలంగాణ విషయానికి వస్తే ఎక్కడ కేసీఆర్‌ పేరు ప్రస్తావించాల్సి వస్తుందోనని అతి తెలివితో అర్థంపర్థం లేని మాటలు మాట్లాడి అభాసుపాలవడం మీకు అలావాటుగా మారింది. తెలంగాణ విషయంలో ఫణికర మల్లయ్యకు ఉన్న చైతన్యం కూడా లేకపాయే. ఏం కావాలి అని మీ గురువు చంద్రబాబు అడిగితే మరో మాట లేకుండా తెలంగాణ కావాలన్నడు. ఇది కదా తెలంగాణ సోయి అంటే!

కాంగ్రెస్‌లో కాక పుట్టించనున్న క్యాబినెట్‌ విస్తరణ

 


బీజేపీ నెక్ట్స్‌ టార్గెట్‌ ఏపీనేనా?

 


Featured post

ప్రజలు మెచ్చేలా పాలన సాగించాలని పౌర సమాజం కోరిక

సీఎం రేవంత్‌ రెడ్డి వైఖరి నాకు దక్కనిది ఎవరికీ దక్కడానికి వీళ్లేదు అన్నట్టు ఉన్నది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజాస్వామ్యం, పౌర సమాజం, తెలంగా...