గుర్నాతారెడ్డి రాజీనామా వ్యవహారంపై వైఎస్అర్ సీపీ స్పందించడం లేదు. సమైక్యవాదం కోసమే తాను రాజీనామా చేశానని ఆయన చెబుతున్నారు. రెండు రోజుల్లో స్పీకర్ ను కలిసి రాజీనామాను ఆమోదించు కుంటాను అంటున్నారు. ఇడుపులపాయ ప్లీనరిలోనే తెలంగాణ పై తమ అభిప్రాయం చెప్పామని అన్న తెలంగాణ వైఎస్అర్ సీపీ నేతలు దీనికి జవాబు చెప్పాలి. మొన్న రాష్ట్రాన్ని విభజిస్తే విధ్వంసం సృష్టిస్తామని అన్న గుర్నాతారెడ్డివ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం వైఎస్అర్ సీపీ నేతలు ఇది కూడా ఆయన వ్యక్తిగతం అంటే కుదరదు. సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు మొదలు పెట్టిన సమైక్య డ్రామాలో ఇప్పటికే కొంతమంది టిడిపి నేతలు తమ వంతు పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పుడు గుర్నాతారెడ్డి రాజీనామా డ్రామా అందులో భాగమే. డిసెంబర్ ప్రకటన వచ్చి మూడేళ్ళు దాటినా...తెలంగాణ సమస్య పరిష్కారం కాలేదంటే ఈ మూడు పార్టీలే కారణం. వీళ్ళ ముసుగులు మొన్న అఖిల పక్ష సమావేశానికి ముందు, తరువాత మెళ్ళ మెళ్ళగా తొలిగిపొతున్నయి. సీమాంధ్ర నాయకత్వాల కింద నడిచే పార్టీల అభిప్రాయాలూ ఎన్నడూ తెలంగాణ ప్రజలకు అనుకూలంగా ఉండవు. అందుకే వాళ్ళ పార్టీల్లోని ఈ ప్రాంత బానిసలను ముందు పెట్టి వాళ్లు తమ కుట్రలు కొనసాగిస్తారు. అయితే సీమాంధ్ర రాజీనామాలు చేస్తే వచ్చేది ఎన్నికలే. అంతే తప్ప తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డుకోలేవు.
Sunday, 20 January 2013
రాజీనామాలు తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డుకోలేవు

Subscribe to:
Post Comments (Atom)
Featured post
-
అనుకోకుండా వచ్చిన జర్నలిజం వృత్తిలో చాలా విషయాలు నేర్చుకున్నాను. రాయడంలో మెళకువలు చెప్పిన పెద్దలు చాలామంది ఉన్నారు. కొవిడ్ సమయంలో ఉద్యోగాన్...
-
పుట్టిన పెరిగిన ప్రాంతమంతమంటే ఎవరికైనా మమకారం ఉంటుంది. అందుకే మా కాలేరు (గోదావరి ఖని) అట్లనే ఉంటది. 80వ దశకంలో కోల్ బెల్ట్ ఏరియాలో ఉపాధి ...
-
నమస్తే తెలంగాణ ఆవిర్భావం రవీంద్రభారతిలో జరిగింది. 6-6-2011న ఆ పత్రిక ప్రారంభోత్సవానికి కేసీఆర్, తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశం...
No comments:
Post a Comment